యాప్నగరం

ఇది సుడిగాలి కాదు దోమల దండు.. హడలిపోయిన జనం

అర్జెంటీనాలో దోమల దండు సుడిగాలి తరహాలో విరుచుకుపడ్డాయి. హైవే మీద ప్రయాణిస్తున్న వాహనదారులను ముప్పుతిప్పలు పెట్టాయి. ఈ వీడియో చూస్తే మీరూ ఆశ్చర్యపోతారు.

Samayam Telugu 27 Feb 2021, 5:49 pm

ప్రధానాంశాలు:

  • అర్జెంటీనాలో ఆశ్చర్యపరిచిన దోమల దండు.
  • దోమలన్నీ కలిసి సుడిగాలిలా విరుచుకుపడ్డాయి.
  • భారీ వర్షాలు, వరదలే కారణం.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Image credit: Twitter
మీరు సుడిగాలిని చూసే ఉంటారు. అయితే, దోమల సుడిగాలిని ఎప్పుడైనా చూశారా? అదేంటీ కొత్తగా.. అనుకుంటున్నారా? అయితే, అర్జెంటీనాలో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి తెలుసుకోవల్సిందే. రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లోని రూట్-7 మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులకు భారీ సుడిగాలి (టొర్నడో) కనిపించింది.
ఆ సుడిగాలి వల్ల తమ వాహనాలు అదుపుతప్పుతాయని భావించారు. అయితే, అలా జరగలేదు. ఎందుకంటే.. అది సుడిగాలి కాదు, దోమల దండు. సుడిగాలి తరహాలో ఎగురుతూ రోడ్ల మీదకు వచ్చాయి. దీంతో వాహనాదారులకు కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అవి ఎక్కడా చెల్లచెదురు కాకుండా గుండ్రంగా తిరుగుతూ ఎగురుతూనే ఉన్నాయి.

Read Also: రేప్ చేసి.. శవాలతో నగ్నంగా ఫొటోలు, ఈ రియాల్టీ స్టార్.. ఓ సైకో కిల్లర్!

ఈ ఘటనను కొందరు తమ కెమేరాల్లో బంధించారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. తొలుత వాటిని చూసి సుడిగాలి అనుకున్నామని, అది దగ్గరకు రాగానే దోమల దండు కనిపించిందని వాహనదారులు ఈ సందర్భంగా తెలిపారు. ఓ వార్తా సంస్థ కథనం ప్రకారం.. నగరంలో భారీ వర్షం కురిసిందని, దానివల్ల మురుగు కాలువలు, చెరువుల్లో నీరు చేరింది.

Read Also: మిస్సైన ఆ విమానం 35 ఏళ్ల తర్వాత.. 92 అస్థిపంజరాలతో ల్యాండైంది!

దీంతో ఆయా చెరువుల్లో గుడ్లు పొదుగుతున్న ఆడ దోమలన్నీ చెల్లాచెదురయ్యాయి. ఆ దోమలన్నీ దండుగా ఏర్పడి రోడ్ల మీదకు వచ్చాయి. ఈ ఘటనపై సెంటర్ ఫర్ పారాసైటులోజికాల్ అండ్ వెక్టర్ స్టడీస్ పరిశోధకుడు జువాన్ జోస్ గర్సియా మాట్లాడుతూ.. ‘‘భారీ వర్షం, వరదల వల్ల నిల్వ ఉన్న నీళ్లపై గుడ్లు పొదుగుతున్న దోమలన్నీ ఒక్కసారే చెల్లాచెదరయ్యాయి. అయితే, వీటి వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, రైతులకే సమస్య అని తెలిపారు. అయితే, దీనిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని 15 రోజుల్లో వాటి ఆయుష్షు ముగిసి చనిపోతాయన్నారు.

వీడియో:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.