యాప్నగరం

తల్లిప్రేమ.. పాముతో పోరాడి తన బిడ్డ ప్రాణాలు కాపాడిన ఎలుక, వీడియో వైరల్

తన బిడ్డను ఎత్తుకుపోతున్న పాముతో తల్లి ఎలుక తన ప్రాణాలకు తెగించి మరీ పోరాడింది. చివరికి తన బిడ్డను రక్షించుకుంది.

Samayam Telugu 1 Dec 2020, 3:57 pm
ల్లి ప్రేమను మాటల్లో వర్ణించలేమనే సంగతి తెలిసిందే. తమ బిడ్డలను కాపాడుకొనే విషయంలో ప్రతి జీవి తన ప్రాణాలను సైతం అడ్డు పెడుతుంది. ఇందుకు ఈ వీడియోనే నిదర్శనం. ఇండియాన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి సుశాంత్ నంద ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఈ ఉత్కంఠభరిత వీడియోలో.. ఓ పాము ఎలుక పిల్లను ఎత్తుకుపోతుంటే.. తల్లి ఎలుక దానితో పోరాడి బిడ్డను రక్షించుకోవడం ఆసక్తి కలిగిస్తోంది.
Samayam Telugu Image credit: Twitter


Read Also: మార్చురీలో కేకలు పెట్టిన శవం.. రక్తాన్ని తోడేస్తుండగా షాకింగ్ ఘటన

వీడియో ప్రకారం.. ఈ ఘటన ఓ హైవే మీద చోటుచేసుకుంది. పాము ఎలుక పిల్లను ఆహారంగా చేసుకునేందుకు నోటితో పట్టుకుని వేగంగా పాకడం మొదలుపెట్టింది. అది చూడగానే తల్లి ఎలుక దాన్ని వెంబడించింది. నోటితో పామును కరుస్తూ ముప్పు తిప్పలు పెట్టింది. దీంతో పాము తన నోటిలో ఉన్న ఎలుక పిల్లకు వదలక తప్పలేదు. అయితే, తల్లి ఎలుక మాత్రం ఆ పామును వదిలిపెట్టలేదు. ఆ పాము పొదల్లోకి వెళ్లిపోయేవరకు తరుముతూనే ఉంది. అనంతరం అది వెనక్కి వచ్చి రోడ్డు మీద పడివున్న తన బిడ్డను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఆలస్యం చేయకుండా మీరు కూడా ఆ వీడియోను చూసేయండి మరి.

వీడియో:
Read Also: బోధిధర్మ తెలుగువారా? ఆయన కనురెప్పలు ఎందుకు కత్తిరించుకున్నారు?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.