ఈ 2020లో కరోనా వైరస్‌తోపాటు ఇంకా ఏవేవో జరుగుతున్నాయి. చివరికి మనుషులు కూడా మతిలేకుండా ప్రవర్తిస్తున్నారు. కరోనా వచ్చిన రోజుల్లో ఓ వ్యక్తి మూతికి ముక్కుకు పెట్టుకోవల్సిన మాస్కును మర్మాంగాల వద్ద కట్టుకుని వీధుల్లోకి తిరిగి ఆశ్చర్యపరిచాడు. తాజాగా మరో వ్యక్తి ఒంటిపై నూలు పోగు లేకుండా తలకు కేవలం పాండా మాస్కును తలకు ధరించి రోడ్డు మీదకు వచ్చాడు. అంతటితో ఆగకుండా రోడ్డుపై స్కేటింగ్ చేస్తూ జనాలకు షాకిచ్చాడు.
Read Also: భోజనానికి పిలిచి హత్యలు.. 12 మందిని ముక్కలు చేసి, ఇంట్లోనే పూడ్చేశాడు.. చిన్న తప్పుతో దొరికేశాడు
అమెరికాలోని 670 హైవే మీద కనిపించిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డిసెంబరు 15న డిజాన్ రేవెల్స్ అనే వ్యక్తి కారులో వెళ్తుండగా ఓ వ్యక్తి పాండా మాస్క్ ధరించి నగ్నంగా స్కేటింగ్ చేస్తూ కనిపించాడు. దీంతో ఆశ్చర్యపోయిన డిజాన్ అదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నగ్నంగా స్కేటింగ్ చేస్తున్న ఆ వ్యక్తి స్కేటింగ్ చేయడమే కాకుండా సెల్ఫీ స్టిక్‌తో ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడని డిజాన్ తెలిపాడు. వీడియో అశ్లీలంగా ఉండటం వల్ల ఇక్కడ పోస్ట్ చేయడం లేదని గమనించగలరు.