యాప్నగరం

Video: ఇంటి బాల్కనీలో రొమాన్స్.. కారుపై అర్థ నగ్నంగా జారిపడిన యువతి... షాకింగ్ వీడియో

బాల్కనీలో రొమాన్స్ ఆమె కొంపముంచింది. ఏకంగా పైనుంచి కారుపై జారిపడేలా చేసింది. అది కూడా అర్థనగ్నంగా. ఆ తర్వాతేమైంది... ఆమె పరిస్థితేంటి?

Samayam Telugu 27 Sep 2021, 10:45 am
తైవాన్‌లోని తైపీలో జరిగిన షాకింగ్, దురదృష్టకర ఘటన ఇది. అక్కడి ఓ ఇంటి బాల్కనీలో తన లవర్‌తో ఓ యువతి శృంగారంలో మునిగితేలుతున్న సమయంలో తేడా వచ్చింది. ఆమె ఒక కాలు జారింది. అంతే వెంటనే ఆమె... బాల్కనీ నుంచి కిందకు జారింది. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కార్లలో బ్లాక్ సెడాన్ కారుపై ధబేల్ మని పడింది. ఆమె బరువుకు కారుపై ఉండే మెటల్ రూఫ్ వంగిపోయింది. కారుపై పడినప్పుడు ఆమె అర్థనగ్నంగా (half naked woman) ఉంది. లక్కీగా ప్రాణాలు పోలేదు. ఈ షాకింగ్ ఘటనను ఆమె లవర్ సోషల్ మీడియాకు షేర్ చేయడంతో అది వైరల్ (shocking viral video) అయ్యింది.
Samayam Telugu కారుపై అర్థ నగ్నంగా జారిపడిన యువతి (image credit - twitter - Raam Beart)


కారుపై పడిన ఆమె షాక్‌లోకి వెళ్లింది. అక్కడి నుంచి కదల్లేకపోయింది. ఆమెకు వెన్ను భాగం స్వల్పంగా దెబ్బతింది. తన పరిస్థితి చూసుకొని బాధపడుతూ ఉండగా... ఈలోగా ఆమె లవర్ అక్కడికి వచ్చాడు. అతను షర్ట్ లేకుండా ఉన్నాడు. ఆమె నొప్పితో బాధపడుతుంటే... ఆమెను కిందకు దింపాడు. ముద్దు పెట్టుకున్నాడు. కౌగలించుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆమెను తీసుకెళ్లాడు.

Video: గతుకుల రోడ్డుతో కొత్తిమీర చట్నీ తయారీ.. ఫన్నీ వీడియో చూస్తే నవ్వాపుకోలేరు

ఈ ఘటన సెప్టెంబర్ 5న జరిగినట్లు తెలిసింది. అక్కడి సీసీటీవీ (cctv footage)లో ఇది రికార్డైంది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఏం జరిగిందో స్థానిక మీడియాకు చెప్పాడు. "ఆ ఘటన జరిగినప్పుడు నేను ఆ ఇంటి వైపు వెళ్తున్నాను. ఆమె కిందపడటం నేను చూడలేదు. కానీ భారీ శబ్దాన్ని విన్నాను. ఏంటా అని చూస్తే ఆమె కారుపై ఉంది. ఆ తర్వాత ఓ వ్యక్తి వచ్చి ఆమెను కాపాడాడు." అని తెలిపాడు.

భవిష్యత్తును ముందే చెప్పేది.. పోలీసులు అరెస్టు చేశారు.. ఎందుకో తెలుసా?
ఆమెను అతను ఆస్పత్రికి తీసుకెళ్లాడని తెలిసింది. ఆమెకు చిన్న గాయాలే అయినప్పటికీ... అవి తగ్గడానికి కొన్ని వారాలు పట్టొచ్చని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

ఆ వీడియోని ఇక్కడ చూడండి.

దెబ్బతిన్న కారు అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న వ్యక్తిది. ఆ జంట కారుకు పరిహారం చెల్లించినట్లు తెలిసింది. సోషల్ మీడియాలో ఈ వీడియోని చూసి కొందరు షాకవుతుంటే... మరికొందరు ఫన్నీగా భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.