యాప్నగరం

వామ్మో.. కుక్క పోలికలతో గబ్బిలం, దీన్ని చూస్తే షాకవుతారు!

ఈ గబ్బిలాన్ని చూస్తే అచ్చం కుక్కను చూస్తున్నట్లే ఉంటుంది. ఇంతకీ ఇది గబ్బిలమా వింత జీవా?

Samayam Telugu 4 Jul 2020, 1:19 pm
బ్బిలాలను మీరు ఎప్పుడైనా చూశారా? చెట్లకు తలకిందులగా వాలాడు నిద్రపోయే వీటిని చూస్తే గుండె గుబేల్ అంటుంది. చైనా వాళ్లకు ఎంతో ఇష్టమైన ఈ గబ్బిలాల వల్లే కరోనా వైరస్ పుట్టిందనే సంగతి తెలిసిందే. ఈ గబ్బిలాలు చూసేందుకు ఎలుకల్లాగానే ఉంటాయి. ఎలుకలకు ఒక వేళ రెక్కలు ఉన్నట్లయితే.. గబ్బిలాలు తరహాలోనే ఉంటాయి. అయితే, తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ గబ్బిలాన్ని చూస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. ఈ గబ్బిలం ఎలుకలా లేదు కుక్కలా ఉంది.
Samayam Telugu Image: Twitter


Also Read అమెరికా ఏడారిలో 22 కిమీల శ్రీ చక్రం.. గీసింది మనుషులు కాదు, నేటికీ వీడని మిస్టరీ

ఔను, దీని ముఖాన్ని చూడగానే మీరు కుక్కనే అనుకుంటున్నారు. పైగా గోదుమ రంగులో చిత్రంగా కనిపిస్తోంది. @emotionalpedant అనే ట్విట్టర్ యూజర్ పోస్టు చేసిన ఈ గబ్బిలం ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. అయితే, దీన్ని చూసి మీరు అస్సలు కంగారు పడొద్దు. ఇది కూడా గబ్బిలాల్లో ఒక రకం. దీన్ని బ్యూటికోఫెరీ ఎపాలెట్ ఫ్రూట్ బ్యాట్ అని అంటారు.

Also Read అమెరికా ఏడారిలో 22 కిమీల శ్రీ చక్రం.. గీసింది మనుషులు కాదు, నేటికీ వీడని మిస్టరీ

ఇతర గబ్బిలాలతో పోల్చితే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. శరీరం గోదుమ, తెలుపు రంగులో ఉంటుంది. దీని తల సాధారణ గబ్బిలాలు కంటే పెద్దగా ఉంటుంది. ఎవరైనా దీన్ని అకస్మాత్తుగా చూస్తే కుక్క రెక్కలు కట్టుకుని ఎగురుతున్నట్లు అనిపిస్తుంది. ఈ కింది ట్వీట్లో ఆ ‘కుక్క’ గబ్బిలాలను చూడండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.