యాప్నగరం

ఏంది సామీ ఈ అరాచకం! కుక్కర్‌ని పెళ్లి చేసుకున్నాడు.. విడాకులిచ్చాడు!

రాన్రానూ చిత్ర విచిత్రమైన వార్తలు ఎక్కువైపోతున్నాయి. సెక్స్ డాల్స్‌, జంతువులు, రోబోలను పెళ్లి చేసుకోవడమే వింత అనుకుంటే... వాటిని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్తూ కుక్కర్‌ని పెళ్లి చేసుకున్నాడు.

Samayam Telugu 1 Oct 2021, 9:51 am
కొన్ని కొన్ని వార్తలు విన్నప్పుడు మనసు రాయి చేసుకోవాలి. ఇది అలాంటిదే. ఇండొనేసియాకు చెందిన ఓ మహానుభావుడు రైస్‌ కుక్కర్‌ (Man marries Cooker)ని పెళ్లి చేసుకున్నాడు. ఆ వివాహ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి. షాకింగ్ విషయమేంటంటే పెళ్లైన నాలుగు రోజుల తర్వాత దానికి విడాకులు ఇచ్చాడు. అతను ఆ కుక్కర్‌ని ఎంతగానో ప్రేమించాడు. పెళ్లి ఫొటోల్లో కూడా టన్నుల కొద్దీ ప్రేమ ఒలకబోశాడు. ఆ సమయంలో... తెల్లటి డ్రెస్‌లో తెల్లగా మెరుస్తూ సిగ్గులమొగ్గలైంది వధువైన రైస్ కుక్కర్. అతను కూడా పెళ్లి దుస్తుల్లో మిలమిలా మెరిసిపోయాడు. ఈ ఫొటోల్లోని ఒక దాంట్లో ఆనమ్ (Anam) పెళ్లి రిజిస్ట్రేషన్ పేపర్లపై సంతకాలు పెడుతూ కనిపించాడు. ఫార్మాలిటీస్ పూర్తి చేశాడు. తద్వారా తన పెళ్లిని చట్టబద్ధం చేసుకున్నాడు. మరో ఫొటోలో కుక్కర్‌ని ముద్దాడాడు.
Samayam Telugu రైస్ కుక్కర్‌తో పెళ్లి (image credit - twitter - @lagidirumah)


"వైట్, క్వైట్.. వంటకు మంచిది... అదిరే కల" అంటూ ఈ ఫొటోలకు క్యాప్షన్ పెట్టారు వీటిని అప్‌లోడ్ చేసిన ట్విట్టర్ యూజర్ @lagidirumah.


ఫొటోల్లో వ్యక్తి పేరు కహిరోల్ ఆనమ్ (Kahirol Anam). అతను ఈ ఫొటోలను తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. సెప్టెంబర్ 20న పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. "వైట్, క్వైట్, పర్ఫెక్ట్. ఎక్కువ మాట్లాడదు, వంట బాగా చేస్తుంది, కల నిజమవుతోంది. నువ్వు లేకపోతే నా రైస్ ఉడకదు" అని పోస్టులో క్యాప్షన్ పెట్టాడు.

మొక్కలు, చెట్ల నుంచి సంగీతం.. అవును.. ఇప్పుడు అది కూడా వినొచ్చు

ఈ ఫోటోలు వైరల్ (viral wedding photos) అయ్యాయి. వీటికి 44వేల లైక్స్ వచ్చాయి. 13500 మంది రీట్వీట్ చేశారు. నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు విచిత్రమైన వస్తువుల ఫొటోలను పెట్టి... వాటిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు.

కుక్కర్‌లో వండిన అన్నం తింటే మంచిది కాదా..
"నేను నా ఎయిర్ ఫ్రైయర్‌ను ఇలా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను." అని ఒకరు కామెంట్ ఇవ్వగా... మరో యూజర్ షాకవుతూ (shocking news) "ఏంటి ఇతను రైస్ కుక్కర్‌ని పెళ్లి చేసుకున్నాడా" అని ప్రశ్నించారు. మరొకరు ఇది తెలివైన పని" అని కామెంట్ ఇచ్చారు.

నాలుగు రోజులకే విడాకులు:
ఇంత హంగామా చేసి పెళ్లి (rice cooker wedding) చేసుకున్నా... ఈ దంపతులు ఎక్కువ కాలం కలిసి జీవించలేకపోయారు. నాలుగు రోజుల తర్వాత తన కుక్కర్ భార్యకు విడాకులు ఇచ్చేసినట్లు ఆనమ్ ఫేస్‌బుక్‌లో తెలిపాడు. కారణమేంటి అంటే... అది రైస్ బాగానే వండుతోంది గానీ... మిగతా వంటలేవీ సరిగా చెయ్యట్లేదని చెప్పాడు.


మొత్తానికి ఈ పెళ్లి, విడాకులు అంతా జోక్ అయిపోయింది. ఆనమ్ సోషల్ మీడియాలో తరచూ ఇలాంటి జోక్స్ తరహా కంటెంట్ చేస్తూ ఉంటాడు. ఇది కూడా అలాంటిదే అనుకోవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.