యాప్నగరం

ఫన్నీ.. పోలీసులను చూసి పీకల్లోతు పేడలో దాక్కున్న దొంగ, చివరికి..

పోలీసుల నుంచి తప్పించుకోడానికి అదే బెస్ట్ ప్లేస్ అని అనుకున్నాడో ఏమో.. అతడు పేడతో నిండిన గోతిలోకి దూకాడు. ఆ తర్వాత అతడి పాట్లు చూడండి. చచ్చేవాడే.. పోలీసుల దయవల్ల బతికిపోయాడు.

Samayam Telugu 3 Dec 2020, 8:51 pm
పోలీసులు నుంచి తప్పించుకోడానికి దొంగలు ఏం చేస్తారో తెలిసిందే. వీలైతే పరిగెడతారు.. లేదా వారికి కనిపించకుండా ఎక్కడైనా దాక్కుంటారు. ఈ దొంగ కూడా అలాగే చేశాడు. కానీ, అతడు దాక్కోడానికి ఎంచుకున్న ప్రాంతమే అస్సలు బాగోలేదు. ఇంతకీ అతడు ఎక్కడ దాక్కున్నాడో తెలుసా? ఆవు పేడలో. అయితే, ఇతడేదో తెలివిగా దాక్కున్నాడని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే.. సమయానికి పోలీసులు రాకపోతే.. అతడు ఆ పేడలోనే సమాధి అయ్యేవాడు.
Samayam Telugu Image Credit: Sussex Police/Facebook


ఇంగ్లాండ్‌లోని ససెక్స్ కౌంటీలో ఓ వ్యక్తి కారును దొంగిలించాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అతడిని వెంబడించారు. దీంతో ఆ దొంగ.. పేడతో నిండి ఉన్న ఓ పెద్ద గోతిలోకి దూకాడు. పోలీసులకు కనిపించకుండా అందులో దాక్కోవాలని ప్రయత్నించాడు. కానీ, ఆ కంపుకు అతడి కళ్లు తిరిగాయి. అంతేగాక, ఆ గొయ్యి సుమారు ఆరు అడుగులు కంటే లోతుగా ఉంది. దీంతో అతడు ఊబిలో కూరుకున్నట్లు పేడలో మునిగిపోయాడు. ఇది గమనించిన పోలీసులు అతడిని ఆ గొయ్యి నుంచి బయటకు తీశారు. అతడిని శుభ్రం చేయకుండానే చేతికి బేడీలు వేశారు. ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also: వామ్మో.. ఒకే ఇంటికి 42 ఫుడ్ ఆర్డర్లు, ‘యాప్’ తప్పిదంతో క్యూకట్టిన డెలివరీ బాయ్స్!

కంపు బరించలేకపోతున్నా.. స్నానం చేశాక అరెస్టు చేయండని ఆ దొంగ అడిగినా పోలీసులు వినలేదు. చేతులకు గ్లవ్స్ వేసుకుని మరీ అతడి చేతికి బేడీలు వేశారు. నెటిజనులు ఈ ఫొటో చూసి ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అతడు పోలీసులకు రుణపడి ఉండాలి. లేకపోతే.. ఈ పాటికి అతడు ఆ పేడలోనే ప్రాణాలు విడిచేవాడు’’ అని అంటున్నారు. నిల్వ ఉంచిన పేడలో మీథేన్, కార్బన్‌ డైయాక్సైడ్, అమ్మోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్‌లు ఉంటాయని, వాటిని పీలిస్తే స్పృహ కోల్పోతారని మరో యూజర్ వ్యాఖ్యానించాడు. ‘‘దొంగలు పేడలో దాక్కోవడం అస్సలు మంచిది కాదు. అది చాలా ప్రమాదకరం’’ అని మరికొందరు సలహా ఇస్తున్నారు.

Read Also: లైవ్‌లో నగ్నంగా టీవీ యాంకర్ భార్య.. షాకైన రాజకీయ నేత!నా రాజకీయ నేత!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.