యాప్నగరం

షాపు సీలింగులో కాపురం పెట్టిన కొండ చిలువ, పదేళ్ల తర్వాత బయటకు..

మీ ఇంటి సీలింగులో వింత శబ్దాలు వస్తే.. తప్పకుండా చెక్ చేయండి. లేకపోతే.. ఏదో ఒక రోజు అది విరిగి పాములు మీద పడవచ్చు.

Samayam Telugu 20 Nov 2019, 6:29 pm
షాపు మూసి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఓ స్పా యజమానికి పెద్ద శబ్దం వినిపించింది. ఏం జరిగిందా అని చూస్తే సీలింగ్ విరిగిపోయి ఉంది. కొద్ది దూరంలో పొడవైన కొండ అతడి వైపే తినేసేలా చూడటంతో షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గత కొన్నాళ్లుగా షాపు సీలింగ్ నుంచి వింతైన శబ్దాలు వినిపించినా ఆ యజమాని పెద్దగా పట్టించుకోలేదు. ఎలుకలు తిరుగుతున్నాయని భావించాడు.
Samayam Telugu iStock-1060820560
Representational image/iStock


Also Read: చిరుతపులి, కొండ చిలువల పోరాటం, చివరికి గెలుపు ఎవరిదంటే..

యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే రెస్క్యూ టీమ్‌తో ఆ షాపుకు చేరుకున్నారు. షాపులో లైట్లను ఆపేసి కొండ చిలువను దుప్పటితో కప్పేసి బంధించారు. ఈ ఘటన చైనాలోని చాంచెంగ్ జిల్లాలో చోటుచేసుకుంది. గౌండాంగ్ కాంప్లెక్స్‌లో చిన్న పాము తిరుగుతోందని పదేళ్ల కిందట చెబుతుండేవారు. అయితే, అది ఎక్కడికి వెళ్లేదో ఎవరికీ తెలిసేది కాదు. కానీ, అది అప్పుడప్పుడు కొందరికి ప్రత్యక్షమై మాయమయ్యేది.

Also Read: అంగంలో 31 అయస్కాంతాలు, 70 రోజులుగా బాలుడు నరకయాతన!

మూడేళ్ల కిందట స్పా ఏర్పాటు కోసం దుకాణంలో పలు పునరుద్ధరణ పనులు చేపట్టిన కూలీలు.. పామును చూశామని చెప్పారు. అయితే, అది ఎటు వెళ్లిందో చూడలేదన్నారు. దాన్ని ప్రత్యక్షంగా చూడనివాళ్లు అవన్నీ వదంతులనే అనుకొనేవారు. కానీ, అది నిజంగానే ఉందని తెలిసి గుండెలు పట్టుకున్నారు. పదేళ్ల కిందట కనిపించిన ఆ పామే ఈ కొండ చిలువా అనుకుంటూ ఆశ్చర్యపోయారు. 19 కిలోల బరువు, 13 అడుగుల పొడవున్న ఈ కొండ చిలువను జాంగ్షన్ జూకు తరలించారు. కనీసం ఒక మేకను మింగితేగానీ ఆకలి తీర్చుకోలేని కొండ చిలువ పదేళ్లపాటు ఆ షాపింగ్ కాంప్లెక్సులో ఎలా జీవించింది? ఆ సీలింగులోకి ఎప్పుడు దూరింది? అనేవి చిక్కు ప్రశ్నలుగా మారాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.