యాప్నగరం

రైల్వే క్రాసింగ్ దగ్గర అంత స్పీడ్ అవసరమా! వైరల్ వీడియో

రైల్వే క్రాసింగ్‌ (Railway crossing)ని చాలా మంది లెక్క చెయ్యరు. క్రాసింగ్ క్లోజ్ చేసి ఉన్నా... ఎలాగొలా దాటేయాలని యత్నిస్తారు. అలా చేసిన ఓ కుర్రాడికి ఏమైందో వీడియో చూడండి.

Samayam Telugu 23 Sep 2021, 11:51 am
ఇండియాలో రైలు ప్రమాదాలు తగ్గినా... రైల్వే క్రాసింగ్ ప్రమాదాలు (Railway crossing Accidents) మాత్రం తగ్గట్లేదు. రోజూ ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా ప్రమాదం జరిగి ప్రాణాలు పోతున్నాయి. ఇందులో మానవ తప్పిదాలే ఎక్కువగా ఉంటున్నాయి. చాలా మంది రైల్వే క్రాస్ గేట్ క్లోజ్ చేసి ఉన్నా... తమ వాహనాలతో సహా క్రాసింగ్ దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. రైలు (Train video) వచ్చి వెళ్లేదాకా ఆగట్లేదు. ఈ క్రమంలో... వాళ్లు క్రాస్ చేస్తున్నప్పుడు ప్రమాదాలు జరిగి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. అలాటి ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ (viral video) అయ్యింది.
Samayam Telugu అంత స్పీడ్ అవసరమా (image credit - twitter - @DoctorAjayita)


ఈ వీడియో (Accident Video)లో ఓ బైకర్... రైల్వే క్రాస్ దగ్గరకు చాలా వేగంగా వచ్చాడు. అతను వస్తున్నప్పుడే గేట్ పడిపోతోంది. ఎలాగైనా గేటు దాటేయాలని వేగంగా వచ్చాడు. అప్పటిగే గేటు పడిపోవడంతో... సడెన్ బ్రేక్ వెయ్యలేక గేటుకు తగులుకొని బైక్‌తో సహా కింద పడ్డాడు. ఆ తర్వాత లేచినా అతనికి స్వల్ప గాయాలయ్యాయి. బండి గేటు దాటి అవతలవైపు పడింది. అతను నెమ్మదిగా వచ్చి ఉంటే ఇలా జరిగేదే కాదు. త్వరగా వెళ్లిపోవాలనే ఆతృత అతని ప్రాణాలకే ప్రమాదంగా మారింది.

ఆ CCTV ఫుటేజ్ వీడియోని ఇక్కడ చూడండి:


ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా... వీటిని చూస్తూ కూడా చాలా మంది మళ్లీ మళ్లీ ఇలాంటి పొరపాట్లే చేస్తున్నారు. అందువల్లే కేంద్ర ప్రభుత్వం చాలా వరకూ రైల్వే క్రాసింగ్‌లను మూసివేస్తోంది. అక్కడ అండర్ గ్రౌండ్ టన్నెల్‌లను ఏర్పాటుచేస్తోంది. తద్వారా ప్రమాదాలకు బ్రేక్ వేసేందుకు ప్రయత్నిస్తోంది.

అర్రెర్రే.. బస్సు కింద పడిన బైకర్... వేగంగా వెళ్లబోయి.!

ఈ వీడియోని ట్విట్టర్‌లో డాక్టర్ అజయితా షేర్ చేశారు. దీన్ని ఇప్పటికే లక్ష మందికి పైగా చూశారు. ఐతే... ఈ ఘటన ఎక్కడ జరిగిందన్నది తెలియలేదు. ఎక్కడైతేనేం ఇది మనకో హెచ్చరిక లాంటిది అనుకోవచ్చు. ఈ షాకింగ్ వీడియో (Shocking video)ని ఇప్పుడు చాలా మంది తమ ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తున్నారు. అలాగే ఆ యువకుడు అంత వేగంగా రావడంపై కొంత మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వామ్మో.. వ్యాక్సిన్ వేసుకోమంటే.. చుక్కలు చూపించాడుగా!

"నాకిప్పటికీ గుర్తుంది. 15 ఏళ్ల కిందట నేను నా స్కూల్, కాలేజీ, ట్యూషన్లకు వెళ్లేందుకు ప్రతి రోజూ ఇంటి నుంచి 45 నిమిషాలు ముందు బయలుదేరేవాణ్ని. 1వ తరగతి నుంచి డిగ్రీ వరకూ అలాగే చేశాను. అక్కడో రైల్వే గేట్ ఉండేది. అది ప్రతి 10 నిమిషాలకు ఓసారి పడిపోయేది. అది నాకు చాలాసార్లు చిరాకు తెప్పించేది. కానీ నేనెప్పుడూ ఇలా పొరపాట్లు చెయ్యలేదు" అని ఓ యూజర్ స్పందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.