యాప్నగరం

Indian Railways video: రైలు ఎక్కబోయి జారిపడిన గర్భిణీ.. సరిగ్గా అప్పుడే...

Indian Railways: వాహనాలు కదులుతున్నప్పుడు ఎక్కకూడదు... దిగకూడదు... ఈ రెండు చర్యలూ ప్రాణాలకు ప్రమాదమే. ఈ విషయాన్ని మనం వారానికి రెండు మూడు సార్లైనా చెప్పుకుంటాం. అయినా సరే... మనలో కొంతమంది ఏం కాదులే అనే ఆలోచనతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. దీనిపై భారతీయ రైల్వే శాఖ తరచూ హెచ్చరికలు చేస్తున్నా... కొంతమంది ప్రయాణికులు అప్రమత్తం కావట్లేదు. తాజాగా ఓ గర్భిణీ... కదిలే రైలు ఎక్కబోయి ప్రాణాలమీదకు తెచ్చుకుంది. ఆ దృశ్యానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Authored byKrishna Kumar | Samayam Telugu 25 Jun 2022, 12:36 pm
Indian Railways: మనం మనుషులం. మనకు కొన్ని పరిమితులు ఉంటాయి. వాటిని దాటి వ్యవహరించడం మన వల్ల కాదు. కదిలే వాహనాలపై గతి శక్తి ప్రభావం బాగా ఉంటుంది. వాటిని ఎక్కాలన్నా, దిగాలన్నా... మనం కూడా అదే గతి శక్తిలోకి మారాల్సి ఉంటుంది. అలా మారడం మన వల్ల కాదు. కాబట్టి స్థితి శక్తితో ఉండే మనం.. వాహనం ఆగిన తర్వాతే... ఎక్కడమైనా, దిగడమైనా చెయ్యాల్సి ఉంటుంది. వాహనం ఆగినప్పుడు... దాని గతి శక్తి పోయి.. స్థితి శక్తి వస్తుంది. అందువల్ల రెండు స్థితి శక్తుల కలయికతో ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. కానీ ఆ గర్భిణీ కంగారులో... ప్రాణాలపైకి తెచ్చుకుంది.
Samayam Telugu రైలు ఎక్కబోయి జారిపడిన గర్భిణీ (image credit - facebook - Ministry of Railways, Government of India)
రైలు ఎక్కబోయి జారిపడిన గర్భిణీ (image credit - facebook - Ministry of Railways, Government of India)


ఈ ఘటన ఉత్తరప్రదేశ్... విరంగన లక్ష్మీభాయ్ ఝాన్సీ రైల్వే స్టేషన్ దగ్గర జరిగింది. ఆగివున్న ఓ రైలు బయలుదేరసాగింది. దాంతో... కొంతమంది ప్రయాణికులు... గబగబా దాన్ని ఎక్కేశారు. గర్భవతి అయిన ఓ మహిళ అదే విధంగా ఎక్కేద్దామని ప్రయత్నించింది. కానీ కాలు జారి బ్యాలెన్స్ తప్పింది. ఆ సమయంలో ఫుట్‌బోర్డుపై ఉన్న ఓ వ్యక్తి ఆమెను పట్టుకున్నాడు. అయినా ఆమె పడిపోతుంటే... ఇద్దరు సామాన్య ప్రయాణికులతోపాటూ.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) పోలీస్ అది చూసి ఒక్కసారిగా ఆమెను చేరారు. ఆ పోలీస్ ఆమెను అతి కష్టమ్మీద... ఆమెను రైలు నుంచి దూరంగా జరపగలిగారు. లేదంటే ఆమె రైలు కింద పడిపోయేదే.

అసలే ఆమె మామూలు మహిళ కూడా కాదు. గర్భిణీ. అలాంటి ఆమె... రైలు వెళ్లిపోతుందనే కంగారులో... దాన్ని ఎక్కేయాలని ప్రయత్నించి.. ప్రాణాలమీదకు తెచ్చుకుంది. ఈ వీడియోని జూన్ 25, 2022న ఫేస్‌బుక్‌లోని తన పేజీ Ministry of Railways, Government of India లో షేర్ చేసిన భారతీయ రైల్వే శాఖ... దయచేసి ఎవరూ కదిలే రైలు ఎక్కడం, దిగడం చేయవద్దు అని కోరింది.
Indian Railways video: ప్రమాదకర ప్రయాణం.. రైలు నుంచి జారిపడిన టీనేజర్
ఆ వీడియోని ఇక్కడ చూడండి (viral video)
viral video: నదిలో చిక్కుకున్న పిల్ల ఏనుగు.. ప్రాణాలకు తెగించి కాపాడిన తల్లి
"ఇంకా ఎన్నాళ్లు ఇలాంటి దృశ్యాలు చూడాలి? రైళ్లకు డోర్లు ఉండాలి. రైలు బయలుదేరే ముందే డోర్లు క్లోజ్ అవ్వాలి. తిరిగి అది ఆగిన తర్వాతే డోర్లు తెరచుకునే విధానం రావాలి" అని ఓ యూజర్ కోరారు. "ఇలాంటి వీడియోలు చూపించే బదులు.. ఇలా చేసేవారికి ఫైన్లు వెయ్యండి. తద్వారా ఫైన్లకు భయపడైనా ఇలాంటివి చెయ్యకుండా ఉంటారు" అని మరో యూజర్ స్పందించారు.
viral: భార్య కోసం ఆస్పత్రికి పామును తీసుకెళ్లాడు.. అదృష్టవంతురాలు అంటున్న డాక్టర్లు
కదిలే రైలు ఎక్కినా, దిగినా... గతి శక్తి ప్రభావం పడటం మాత్రమే కాదు... అభికేంద్ర బలం (Centrifugal force) ప్రభావం కూడా పడుతుంది. ఇదేంటంటే.. బలమైన వస్తువు.. తనకంటే బలం తక్కువగా ఉండే వస్తువును తనవైపు లాక్కుంటుంది. ఈ కేసులో బలమైన వస్తువు రైలు. అది ఆ మహిళను తనవైపు లాక్కుంటుంది. అందువల్లే రైలు నుంచి పడిపోగానే... ఆమె రైలువైపే వెళ్లింది గానీ... ప్లాట్‌ఫామ్ వైపు రాలేకపోయింది. ఇప్పుడే కాదు... ఇలా వాహనాల నుంచి పడిపోయిన చాలా సందర్భాల్లో పడిన వారు వాహనంవైపే పడుతుంటారు. అభికేంద్రబలం వారిని తనవైపు లాగేస్తుంది. కాబట్టే... ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.