యాప్నగరం

Video: కొండచిలువ కొబ్బరిచెట్టు ఎక్కిన వేళ.. వీడియో చూస్తే వణుకే!

కొండచిలువ చాలా నెమ్మదిగా పాకుతుంది. ఐతే... అది కొబ్బరి చెట్టు ఎలా ఎక్కుతుందో చాలా మందికి తెలియదు. అందుకు సంబంధించిన వీడియోని మనం చూద్దాం.

Samayam Telugu 15 Nov 2021, 2:44 pm
జనరల్‌గా వైరల్ వీడియోలకు ఎక్కువ లైఫ్ ఉండదు. కొన్ని రోజులకే అవి ఫేడవుట్ అవుతాయి. కానీ వైరల్‌లో కూడా కొన్ని వీడియోలు ఎవర్‌గ్రీన్‌గా ఉంటాయి. వాటిని ఎప్పుడు చూసినా... ఇప్పుడే చూసిన ఫీల్ కలిగిస్తాయి. ముఖ్యంగా జంతువులు, పక్షులు, సరీసృపాల వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. అదే విధంగా ఓ పాత వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. ఇందులో ఓ భారీ కొండ చిలువ కొబ్బరిచెట్టు ఎక్కింది. నేలమీద పాకేటప్పుడు కొండచిలువ... వంపులు తిరుగుతూ ముందుకుసాగుతుంది. కానీ కొబ్బరిచెట్టు ఎక్కేటప్పుడు మాత్రం అది భూమ్యాకర్షణ శక్తి (Earth Gravity)ని లెక్కలోకి తీసుకుంది. బల్లిలా ఎక్కేంత సీన్ కొండచిలువకు ఉండదు కాబట్టి... అది కొబ్బరి చెట్టును చుట్టూ చుట్టుకొని మెల్లమెల్లగా పైకి ఎక్కింది (coconut tree climbing python).
Samayam Telugu కొబ్బరిచెట్టు - కొండచిలువ (Image credit - youtube -  https://youtu.be/6Aze5pRETgM)


ఈ వీడియోని తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో royal_pythons_ అకౌంట్‌లో షేర్ చేశారు. 3 రోజుల కిందట పోస్ట్ చేసిన ఈ వీడియోని ఇప్పటివరకు 85వేల మందికి పైగా చూశారు.

ఆ వీడియో (viral video)ని ఇక్కడ చూడండి
View this post on Instagram A post shared by Royal Pythons (@royal_pythons_)

నిజానికి ఈ వీడియోని 2016 మే 14న యూట్యూబ్‌లోని Amazing Video'sలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోని ఎవరైనా సరే ఫెయిర్ యూసేజ్ కోసం వాడుకోవచ్చని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో తెలిపారు. ఒరిజినల్ వీడియోని ఇప్పటివరకు 32,472 మంది చూశారు (shocking video).

ఆ యూట్యూబ్ వీడియోని ఇక్కడ చూడండి

కొబ్బరిచెట్టును ఇలా ఎక్కితేనే పైకి వెళ్లగలను అని ఆ కొండచిలువ ఆలోచించగలగడం గొప్ప విషయమే. సహజంగానే కొండచిలువను చూస్తే దాని భారీ ఆకారం వల్ల మనకు ఒకింత ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు అదని ఇలా ఫీట్లు చేస్తూ... చెట్టు ఎక్కడం మరింత షాకింగ్ విషయం.

Thrilling Video: అడవిలోకి వెళ్లారు.. ఎదురుగా సింహం.. ఆ తర్వాత..!
ఈ ప్రపంచంలో ప్రమాదకరమైన పాముల్లో కొండచిలువలు కూడా ఉన్నాయి. ఇవి దాదాపు 21 అడుగుల పొడవు పెరగగలవు. బరువు 75 కేజీలు ఉండగలవు. అందువల్ల వీటికి చెట్లు ఎక్కడం కష్టమైన పని. కానీ ఈ వీడియోలో పాము... చాలా తేలిగ్గా చెట్టు ఎక్కేయడం మనం చూశాం. చుట్టుకుంటూ ఎక్కడం వల్లే దానికి ఇది సాధ్యమైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.