యాప్నగరం

viral video: అడవి పంది పవర్.. ఇనుప గేటు బద్ధలైపోయిందిగా!

అడవి పందికి ఎంత శక్తి ఉంటుందో ఈ వీడియో ద్వారా బయటపడుతోంది. అందుకే అందరూ ఈ వీడియోని చూస్తున్నారు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఓ ఇంటి సీసీ కెమెరాలో అడవి పంది పవర్ ఎలా ఉంటుందో చూపించే దృశ్యం రికార్డ్ అయ్యింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది.

Samayam Telugu 15 Dec 2021, 12:48 pm
అడవిలో మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా వన్య ప్రాణులకు సంబంధించి మనకు కొన్ని అంచనాలు ఉంటాయి. మన దృష్టిలో సింహం, పులి వంటివి మాత్రమే బలమైన జంతువులు, వాటితో పెట్టుకుంటే ప్రమాదం అనుకుంటాం. కానీ... ఇప్పుడు చూడబోయే వీడియోతో అడవి పందులు ఎంత పవర్‌ఫుల్లో అర్థమవుతుంది. అది అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం (image credit - pixabay - Thomas G)


సోషల్ మీడియాలో ఇలాంటి చక్కటి వీడియోలు, మనకు తెలియని విషయాలు తరచూ షేర్ అవుతున్నాయి. అలాంటి వాటిలో కొన్ని మన దృష్టికి వస్తాయి. అవి మనకు షాక్ ఇస్తాయి. ఈ దృశ్యం అలాంటిదే.

వైల్డ్‌లైఫ్ వీడియోలు మనకు బాగా నచ్చుతాయి. ఎందుకంటే.. అవి రొటీన్‌గా ఉండవు. వాటిలో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. సహజమైన ప్రకృతి వాటిలో కనిపిస్తుంది. అందుకే సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటి సీసీకెమెరాలో రికార్డైన దృశ్యం ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఓ అడవి పంది తనకు ఎంత బలం ఉంటుందో అందులో చూపించింది. అది చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

ట్విట్టర్‌లోని షేర్ అవుతున్న ఆ వీడియో అంతా కలిపి 7 సెకండ్లే ఉంది. అందులో ఓ భవనానికి ఇనుప గేట్లు ఉన్నాయి. ఇంటి బయట రోడ్డు ఉండగా... ఆ రోడ్డుకు అటువైపున అడవి ఉన్నట్లు కనిపిస్తోంది. అటు నుంచి వచ్చిన ఓ అడవి పంది... రోడ్డుపై ఓ లారీ వస్తుండటం చూసి... ప్రాణభయంతో... ఇంటివైపు పరుగులు పెట్టింది. కానీ ఇంటి గేట్లు మూసి ఉండటంతో... వాటిలో ఓ గేటును తన తలతో ఢీకొట్టింది. అంతే ఆ గేటు ఒక్కసారిగా ముక్కలై ఉడి కింద పడిపోయింది. తనపై పడిన గేటును ఎలాగొలా తొలగించుకున్న అడవిపంది... ఆ ఇంటివైపు పరుగులు పెట్టింది. అలా ఓ గేటును అది పగలగొట్టేయడాన్ని బట్టీ దానికి ఎంత శక్తి ఉందో అర్థమవుతోంది. అందుకే వీడియో క్యాప్షన్‌లో "అడవి పంది పవర్" అని పెట్టారు.

View this post on Instagram A post shared by nature (@vahshi_ir)

ఈ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సురేందర్ మెహ్రా కూడా పోస్ట్ చేశారు. అడవి పందులకు సంబంధించి ఆయన మరిన్ని విషయాలు చెప్పారు. భారతదేశంలో ఉన్న జంతువుల్ల అత్యంత శక్తిమంతమైనది అడవి పంది అన్నారు. పులులకు కూడా వాటిని పట్టుకోవడం కష్టం అన్నారు.

Video: పిల్లితో పెట్టుకున్న కుక్క.. వదిలెయ్యమంటూ లబోదిబో!
viral video: పిల్లిని చూసి శిలైపోయిన వేట కుక్క.. షాకైన ఓనర్
ప్రత్యేకంగా ఉండటంతో ఈ వీడియో నెటిజన్లకు బాగా నచ్చుతోంది. చాలా మంది దీన్ని అత్యంత ఆసక్తిగా చూస్తున్నారు. అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ఇది వైరల్ అవుతోంది. అడవి పంది పవర్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియో మీకు కూడా ఆశ్చర్యం కలిగించి ఉండొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.