యాప్నగరం

Video: వెనీలా ఐస్‌క్రీమ్ దోసె... అవసరమా... నెటిజన్లు ఫైర్!

ఇన్నాళ్లూ మనకు ఆనియన్ దోసె, మసాలా దోసె వంటి హాట్ దోసెలే తెలుసు... ఇప్పుడు ఇది స్వీట్ దోసె. మరి దీనిపై నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారో చూద్దాం.

Samayam Telugu 15 Oct 2021, 9:54 am
ఆ మధ్య గుజరాత్‌లో ఓ స్ట్రీట్ వ్యాపారి (street food video)... ఎగ్ ఆమ్లెట్‌పై ఫాంటా కూల్ డ్రింక్ వేసి పేస్టు లాంటిది ఏదో చేశాడు. అది చూసిన నెటిజన్లు "వామ్మో... అవసరమా" అన్నారు. అది ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు మరో స్ట్రీట్ వ్యాపారి దోసెపై స్వీట్ ప్రయోగాలు చేస్తున్నాడు (unique dosa video). జనరల్‌గా మనకు హాట్ దోసెలైన స్పైసీ దోసె, కారం దోసె, మసాలా దోసె, ఉల్లి దోసె, సెట్ దోసె, సాదా దోసె వంటివి తెలుసు. ఇలా వేడివేడిగా, స్పైసీగా ఉండే దోసెలే మనకు నచ్చుతాయి. వాటితో చెట్నీ కలుపుకొని తింటే ఆ మజాయే వేరు. కానీ కొత్తదనం పేరుతో ఉన్న వాటికే అదనపు హంగులు చేస్తున్నారు కొందరు వ్యాపారులు. అలాంటి వారిలో ఒకరైన ఈ వ్యాపారి ఏం చేశారో చూద్దాం (vanilla ice cream chocolate dosa video).
Samayam Telugu ఐస్‌క్రీమ్ దోసె (image credit - twitter - @vijaysheth)


ట్విట్టర్‌లోని @vijaysheth అనే యూజర్... ఈ స్వీట్ దోసె వీడియోని అప్‌లోడ్ చేశారు. 1.38 నిమిషాల ఈ వీడియోలో చెఫ్.. వాఫిల్ తయారుచేశాడు. ముందుగా పెనంపై గుండ్రంగా దోసె వేసి... నెక్ట్స్ దానిపై గడ్డకట్టి వున్న ఐస్ క్రీమ్ వేశాడు. వెంటనే చాకొలెట్ సిరప్ కూడా వేశాడు. కొద్దిగా వేడి అవ్వగానే... బటర్ వేశాడు. దోసె మొత్తం అది చేరేలా అంతా రాశాడు. తర్వాత డైరీమిల్క్ చాకొలెట్‌ని పొడిలా చేస్తూ చల్లాడు. దోసె కాస్తా చాకొలెట్ కలర్ లోకి వచ్చేసింది. ఆ తర్వాత ప్యాన్ కేక్ కట్ చేసినట్లుగా చేసి... వాఫిల్ చేశాడు. దీని ధర రూ.200 అని తెలిపాడు.

ఆ వీడియో (viral video)ని ఇక్కడ చూడండి.

నెటిజన్లు దీనిపై రెండు రకాలుగా స్పందిస్తున్నారు. కొత్తదనాన్ని స్వాగతించాలి, చాకొలెట్ లవర్స్‌కి ఇది బాగా నచ్చుతుంది అని కొంత మంది అంటుంటే... ఎందుకొచ్చిన కాంబినేషన్ ఇది అని మరికొందరు తిడుతున్నారు. దోసె, ఐస్‌క్రీమ్, చాకొలెట్... వీటిని దేనికదే తింటేనే బాగుంటాయి తప్ప... ఇలా మిక్స్ చేసి తింటే... కడుపులో తిప్పడం గ్యారెంటీ అంటున్నారు. ఓ నెటిజన్ దీనిపై సీరియస్ అయ్యారు. ఇలాంటి అడ్డమైన ప్రయోగాలు చెయ్యకుండా అధికారులు యాక్షన్ తీసుకోవాలని కోరారు.

"దోసెపై పెంగ్విన్‌ని ఉంచినట్లుగా నాకు అనిపించింది" అని మరో యూజర్ విచిత్రమైన కామెంట్ పెట్టారు. ఇది చూస్తే దేవుడు కూడా భయపడతాడని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.