యాప్నగరం

viral video: కోకాకోలాతో మ్యాగీ.. తింటే ఏమవుతుందో తెలుసా?

మ్యాగీ ఆరోగ్యానికి ప్రమాదకరం అనీ, అందులో సీసం ఉందనీ... ఇదివరకు ఇండియాలో పెద్ద దుమారమే రేగింది. కొన్నాళ్లు మ్యాగీని నిషేధించారు కూడా. ఆ తర్వాత మళ్లీ అదే ప్రొడక్ట్ ఇండియాలో కంటిన్యూ అయ్యింది. చాలా మంది తల్లులు... తమ పిల్లలకు రోజూ మ్యాగీ వండి పెడుతున్నారు. ఈ 2 మినిట్స్ వంటకంపై స్ట్రీట్ వ్యాపారులు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా ఓ వ్యాపారి కోకాకోలాతో... మ్యాగీ వండాడు. ఆ వీడియో కొద్దిగా వైరల్ అయ్యింది. మరి అది ఎలా ఉంది?

Authored byKrishna Kumar | Samayam Telugu 17 May 2022, 10:43 am
మ్యాగీని ఎన్నో రకాలుగా వండుకోవచ్చు. మ్యాగీ ప్యాకెట్‌లో ఇచ్చే మసాలాతో వండుకోవచ్చు లేదా కూరగాయల్ని మిక్స్ చేసి వండుకోవచ్చు. అంతవరకూ బాగానే ఉంటుంది. కానీ ఇదే మ్యాగీని కూల్‌డ్రింక్స్, ఫ్రూట్స్‌తో వండుకుంటే అస్సలు బాగోదన్నది నెటిజన్ల మాట. ఈమధ్యే ఓ స్ట్రీట్ వెండర్... మామిడిపండుతో మ్యాగీని వండటం వివాదమైంది. ఆ వీడియో చూసి నెటిజన్లు తిట్టిపోశారు. దాంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియోని డిలీట్ చేశారు. తాజాగా మరో వ్యాపారి... కోకాకోలాతో మ్యాగీ వండటం చర్చనీయాంశం అయ్యింది. (maggi with coca cola)
Samayam Telugu కోకాకోలా మ్యాగీ (image credit - youtube - Desi Food Crafts)


ఆ వీడియోలో వ్యాపారి... ముందుగా... ప్యాన్‌లో నూనె వేసి... ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని వేపాడు. తర్వాత టమాటా వేశాడు. నెక్ట్స్ మసాలా వేసి వేపాడు. ఆ తర్వాత కోకాకోలా బాటిల్ ఓపెన్ చేసి... ప్యాన్‌లో పోశాడు. నీరు బదులు కోక్ పోశాడు. కోక్ బాగా ఉడుకుతున్న సమయంలో... అందులో మ్యాగీ వేసి వండాడు. (maggi mix with coca cola)

ఈ వీడియోని యూట్యూబ్‌లోని Desi Food Crafts ఛానెల్‌లో ఏప్రిల్ 25, 2022న అప్‌లోడ్ చేశారు. దీన్ని ఇప్పటివరకు 344 మంది చూడగా... ఒక్కరే లైక్ చేశారు. (street food videos)
Google Maps: ఆ ఇంటిని బ్లర్ చేసిన గూగుల్ మ్యాప్స్.. ఎందుకో తెలుసా?
ఆ వీడియోని ఇక్కడ చూడండి (viral video)

ఇది తింటే ఏమవుతుంది?
ఈ మ్యాగీ వంటకంలో అసలు నీరే వాడలేదు. మొత్తం కోకాకోలా పోశారు. అదే సమస్య అనుకోవచ్చు. కోకాకోలాను డైరెక్టుగా తాగాలే తప్ప... ఉడికించకూడదు. అలా చేస్తే... అందులోని ఫ్లేవర్స్, గ్యాస్... మన శరీరానికి హానికరంగా మారతాయి. కోక్‌తో ఏ వంటకం వండినా ప్రమాదకరమే. కోక్ మాత్రమే కాదు... ఏ కూల్‌డ్రింక్‌తో వంటలు వండినా... అవి మనం తినేందుకు మంచివి కావు.
NASA: మెరుస్తున్న భూమి.. అంతరిక్ష కేంద్రం వీడియో వైరల్
అసలు కోకాకోలా డ్రింకే ఆరోగ్యానికి హానికరం అంటున్నారు కొందరు నిపుణులు. రోజుకు ఒకటి లేదా రెండు కోక్ డ్రింక్స్ తాగినా... టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 20 శాతం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. కోక్‌లో కలిపే పంచదార వల్ల హైబీపీ వస్తుందనీ... శరీరంలో అధిక కొవ్వు చేరి... బరువు పెరిగిపోతారని అంటున్నారు. ఈ అన్ని కారణాల వల్ల గుండె జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు. కోలాస్ ఇతర తీపి డ్రింక్స్... పాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చేందుకు కారణం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
viral video: గుర్రంపై వరుడు.. పేలిన బాణసంచా.. తర్వాత ఊహించని ఘటన
ఇన్ని రకాల సమస్యలున్న కోకాకోలాను మ్యాగీలో కలుపుకొని తినడం ఎందుకన్నది ప్రశ్న. అంతగా కావాలనుకుంటే... విడిగా తాగడం మేలు అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.