యాప్నగరం

మిట్ట మధ్యాహ్నం అస్తమించిన సూర్యుడు.. 65 రోజుల తర్వాతే సూర్యోదయం

ఈ 2020కు ఇది చివరి సూర్యోదయం. మళ్లీ అక్కడ సూర్యుడిని చూడాలంటే కనీసం రెండు నెలలు వేచి చూడాలి. మళ్లీ అక్కడ జనవరి 22, 2021లో మాత్రమే సూర్యుడు ఉదయిస్తాడు.

Samayam Telugu 20 Nov 2020, 2:42 pm
సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తాడు? అనే ప్రశ్నకు మీరు ఏం సమాధానం ఇస్తారు. అంతా సాయంత్రమనే చెబుతారు. 5.30 నుంచి 6.30 గంటల మధ్యలో సాధారణంగా సూర్యాస్తామయం ఉంటుందని చెబుతారు. కొన్ని సీజన్లలో ఈ సమయం మారొచ్చు కూడా. అయితే, ఆ మార్పు కేవలం నిమిషాల్లో మాత్రమే ఉంటుంది. కానీ, అక్కడ మాత్రం సూర్యస్తమయానికి కొన్ని గంటలు.. రోజులు.. నెలల వ్యత్యాసం ఉంటుంది. చివరికి సూర్యాస్తమయం మధ్యాహ్నం వేళల్లోనే జరుగుతుంది. అంటే సుమారు 1 గంట నుంచి 2 గంటల సమయంలో. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే, ఆ ప్రాంతం గురించి మీరు తప్పకుండా తెలుసుకోవల్సిందే.
Samayam Telugu Image credit: @kirsten_alburg/Instagram


అమెరికాకు ఉత్తర దిక్కున ఉన్న అలస్కాలోని ఉట్కియావిక్‌లో బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు చివరి సూర్యాస్తమయం జరిగింది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో చిమ్మ చీకట్లు అలముకున్నాయి. మళ్లీ 2021, జనవరి 22న మాత్రమే అక్కడ సూర్యుడు ఉదయిస్తాడు. అంటే.. అక్కడ దాదాపు 65 రోజులు సూర్యుడే ఉండడు. అప్పటి వరకు అక్కడ పగలు కూడా ఉండదు. ఈ 2020 సంవత్సరానికి ఇదే చివరికి సూర్యాస్తమయం.

Read Also: భయానకం.. విమానం అద్దం పగిలి ఎగిరిపోయిన పైలట్, 23 వేల అడుగుల ఎత్తులో...

మనకు రాత్రి ఒక పూట మాత్రమే ఉంటుంది. కానీ, అక్కడ రెండు నుంచి మూడు నెలలు ఉంటుంది. పగలు కూడా రెండు నుంచి మూడు నెలలు ఉంటుంది. దీర్ఘ కాలికంగా ఉండే పగటి వేళల్లో జీవించడం సులభమే. కానీ, దీర్ఘకాలిక రాత్రిళ్లు జీవించడమే కష్టం. ఈ రాత్రులను అక్కడ ‘పోలార్ నైట్’ అని అంటారు. ఇది సుమారు 320 కిమీలు విస్తరించి ఉంటుంది. ఆ ప్రాంతంలో 2 నెలలకు పైగా సూర్యుడే కనిపించడు. అయితే, మిగతా ప్రాంతాల్లో సూర్యోదయం వేళ కాస్త కాంతి వస్తుంది. కాబట్టి.. పూర్తిగా చీకటిగా కాకుండా వెన్నెల రాత్రిలా ఉంటుంది.

Read Also: ఒక్క రూపాయికే విమాన టికెట్.. ఆ సంస్థ ఇప్పుడు ఏమైంది? అసలు కథ ఇదీ!

ఉట్కియావిక్‌‌లో నివసిస్తున్న @kirsten_alburg అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్.. చివరి సూర్యస్తమయాన్ని తన మొబైల్ కెమేరాలో బంధించింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఉట్కియావిక్‌‌కు నార్త్ పోల్‌లో ఉండటం వల్ల అక్కడ సుమారు 2 నెలలు సూర్యుడు కనిపించడని, ఆ కాలాన్ని చలికాలంగా పిలుస్తారు. సూర్యుడు కనిపించే మిగతా రెండు నెలలను వేసవిగా పిలుస్తారు. వేసవిలో సూర్యస్తమయం, సూర్యోదయం వంటివి ఉండవు. సూర్యుడు 24X7 కనిపిస్తూనే ఉంటాడు. మరి, ఆ అరుదైన సూర్యస్తమయాన్ని చూసేద్దామా!

వీడియో (ఇన్‌స్టాగ్రామ్):
View this post on Instagram A post shared by Kirsten Alburg (@kirsten_alburg)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.