యాప్నగరం

విగ్రహం కాదు కేకు.. తమిళనాడులో 6 అడుగుల మారడోనా కేక్

తమిళనాడుకు చెందిన ఓ బేకరి.. ఫుట్‌బాల్ క్రీడాకారుడు మారడోనాకు ఆరు అడుగుల కేకుతో నివాళులు అర్పించింది.

Samayam Telugu 28 Dec 2020, 11:36 am
ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మారడోనాకు తమిళనాడుకు చెందిన ఓ బేకరి వినూతన రీతిలో నివాళులు అర్పించింది. ఆయన ప్రతిభకు గుర్తుగా.. ఆయనపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుతూ.. ఆరు అడుగుల కేకును తయారు చేసింది. ఈ కేకు చూసి.. స్థానికులతోపాటు నెటిజనులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Samayam Telugu Image Credit: ANI


రామనాథపురంలోని బేకరీ నిర్వాహకులకు ఈ ఆలోచన వచ్చింది. ఈ సందర్భంగా 60 కిలోల చక్కెర, 270 కోడి గుడ్లతో కేకు తయారీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బేకరీ యజమాని సతీష్‌రంగనాథన్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవల కనుమూసిన పుట్‌బాల్ క్రీకారుడు మారడోనాకు నివాళులు అర్పించేందుకు ఈ కేకు రూపొందించాం. మొబైళ్లలో కాకుండా మైదానాల్లో ఆటలాడాలని యువతకు తెలియజెప్పడం మా ముఖ్య ఉద్దేశం’’ అని తెలిపారు. ఈ కేకు తయారీకి నాలుగు రోజులు శ్రమించామని పేర్కొన్నారు.
2021 మరింత భయానకం? కలవరపెడుతున్న బ్లైండ్ బాబా వంగా భవిష్య వాణి
గతంలో ఇదే తరహాలో సచిన్ టెండూల్కర్, ఉసైన్ బోల్ట్, మైక్ టైసన్ వంటి ప్రముఖ క్రీడాకారుల కేక్‌లను కూడా తయారు చేశామన్నారు. ప్రతి క్రిస్ట్మస్, న్యూ ఇయర్‌లకు ఇంకా ఎన్నో రకాల కేకులు తయారుచేస్తామన్నారు. ఇళయరాజా, ఏపీజే అబ్దుల్ కలాం కేకులను సైతం తయారు చేశామని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.