యాప్నగరం

పోలీస్ స్టేషన్‌కే కన్నం వేసిన దొంగలు, 185 ఫోన్లు ఎత్తుకెళ్లి.. పోలీసులకు సవాల్!

ఈ దొంగలు మహా ముదురులు.. ఇళ్లల్లో దొంగతనాలు చేసి బోరు కొట్టిందో ఏమో, ఏకంగా పోలీస్ స్టేషన్‌కే కన్నం వేశారు.

Samayam Telugu 16 Jan 2020, 11:32 am
ళ్లల్లో దొంగతనాలు చేసి చేసి.. బోర్ కొట్టిందో ఏమో, ఆ దొంగలు ఏకంగా పోలీస్ స్టేషన్‌కే కన్నం వేశారు. తాపీగా 185 ఫోన్లు ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటన మరెక్కడో కాదు, మహారాష్ట్రలోని కొల్హాపూర్‌‌లో చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్లో దొంగలుపడ్డారనే సమాచారం దావనంలా వ్యాపించడంతో జనాలు నోరెళ్లబెట్టారు. పోలీస్ స్టేషన్‌కే రక్షణ లేకపోతే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
Samayam Telugu Photo: Pixabay
Photo: Pixabay


కొల్హాపూర్‌కు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న జయ్‌సింగపూర్‌ పోలీస్ స్టేషన్‌‌‌ను దొంగలు టార్గెట్ చేసుకున్నారు. దొంగల నుంచి స్వాధీనం చేసుకొనే విలువైన వస్తువులన్నీ ఠాణాలోని స్టోర్ రూమ్‌లో ఉంచుతారని తెలుసుకున్న దొంగలు.. చోరీకి స్కెచ్ వేశారు. ఆ పోలీస్ స్టేషన్ గురించి వారికి ముందే అవగాహన ఉండటం, భవనం వెనుక సీసీటీవీ కెమేరాలు లేకపోవడంతో సులభంగా దొంగతనం చేయవచ్చని భావించారు.

Also Read: హైసెక్యూరిటీ జైలుకు చెంచాలతో కన్నం వేసి ఖైదీలు పరార్, ఇదో థ్రిల్లింగ్ మిస్టరీ!

పక్కా ప్లాన్‌తో పోలీసులకు ఏ మాత్రం అనుమానం కలగకుండా రాత్రికి రాత్రే పోలీస్ స్టేషన్ గోడకు కన్నం పెట్టారు. అనంతరం 185 మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనతో మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటన పోలీస్ వ్యవస్థకే సిగ్గుచేటని భావిస్తున్నారు. పోలీస్ స్టేషన్‌కే కన్నం వేసేందుకు ధైర్యం చేసిన ఆ దొంగలను విడిచిపెట్టే ప్రసక్తే లేదని సపథం పన్నారు. ఆ దొంగల కోసం పోలీసులంతా జల్లెడపడుతున్నాడు.

Also Read: ఒక పాట.. వందలాది ఆత్మహత్యలకు కారణమైంది, ఎలాగో తెలుసా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.