యాప్నగరం

నవ్వాలా? ఏడ్వాలా?.. ఈ సాఫ్ట్ డ్రింక్ ప్రకటన చూసి మీరే చెప్పండి, ఇంత భయానకమా!

ఇలాంటి సాఫ్ట్ డ్రింక్ ప్రకటన మీరు ఎప్పుడు చూసి ఉండరు. దీన్ని చూస్తే తప్పకుండా మీరు నోరెళ్లబెడతారు. ఇంతకీ ఈ ప్రకటన ఉద్దేశం ఏమిటీ?

Samayam Telugu 28 Nov 2020, 2:04 pm
సాఫ్ట్ డ్రింక్ యాడ్స్ కొన్ని రొటీన్‌గా ఉంటాయి. కొన్ని చాలా గమ్మత్తుగా ఉంటాయి. మరికొన్ని చూసే కొద్ది చూడాలనిపించేలా ఉంటాయి. ఇంకొన్ని ప్రకటనల్లో కూల్ డ్రింక్ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సాహసాలు చేస్తున్నట్లు చూపిస్తుంటారు. రూ.20 పెడితే వచ్చేసే కూల్ డ్రింక్ కోసం ఇంత ఓవర్ ‘యాక్షన్’ ఎందుకు చేస్తారనేది చాలామందికి అర్థం కాదు కూడా. ఇలాంటి అర్థంలేని ప్రకటనలు ఇంకా చాలానే ఉన్నాయనుకోండి. కానీ, సోషల్ మీడియాలో ట్రెండవ్వుతున్న ఓ తాజా ప్రకటన మాత్రం నెటిజనులను గందరగోళానికి గురిచేస్తోంది. ఆ ప్రకటన చూసి నవ్వాలా? ఏడ్వాలో తెలియక.. తలలు పట్టుకుంటున్నారు.
Samayam Telugu Image Credit: RC Cola Philippines/YouTube


ఫిలిప్పీన్స్‌కు చెందిన ‘RC Cola’ అనే సంస్థకు చెందిన ఈ ప్రకటన ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. 1.37 నిమిషాలు ఉన్న ఈ ప్రకటనలో ఓ పిల్లాడు స్కూల్ బ్యాగ్‌తో ఇంటికి వస్తాడు. ‘‘అమ్మా.. నన్ను మీరు దత్తత తీసుకున్నారా?’’ అని అడుగుతాడు. ఆ ప్రశ్నకు భావోద్వేగానికి గురైన తల్లి.. ‘‘ఇతరుల మాటలను మనసులో పెట్టుకోకు’’ అని అంటుంది. దీంతో ఆ పిల్లాడు.. తన స్కూల్ బ్యాగ్ తెరిచి బల్ల మీద బోర్లా పడుకుంటాడు. షర్ట్ విప్పి అతడి వీపు మీద నాలుగు గాజులు అతికి ఉంటాయి. వాటిని చూపిస్తూ.. ‘‘మరి, నా వెనుక ఈ గ్లాసులు ఎలా వచ్చాయమ్మ?’’ అని అడుగుతాడు.

Read Also: ఒక్క రూపాయికే విమాన టికెట్.. ఆ సంస్థ ఇప్పుడు ఏమైంది? అసలు కథ ఇదీ!

దీంతో ఆమె తల్లి.. నిజం చెప్పే సమయం వచ్చిందంటూ.. తన తలను తీసేస్తుంది. తల లోపల దాగి ఉన్న ‘ఆర్సీ కోలా’ కూల్ డ్రింక్ బాటిల్‌ను చూపిస్తుంది. ఆ తర్వాత ఆ డ్రింక్‌ను నాలుగు గాజు గ్లాసుల్లో పోస్తుంది. ఆ గ్లాసుల్లోని డ్రింక్‌ను తల్లి, పిల్లాడితోపాటు మిగతా కుటుంబ సభ్యులు కూడా స్ట్రాలు వేసుకుని తాగడంతో ప్రకటన ముగుస్తుంది. అయితే, ఆమె డ్రింక్ బాటిల్‌‌గా ఉంది కాబట్టి.. గ్లాసులతో పుట్టిన పిల్లాడిని దత్తత తీసుకున్నారా? లేదా ఆమె డ్రింక్ కాబట్టి.. కొడుకు గ్లాసులతో పుట్టాడా అనే అనే సందేహం నెటిజనుల మెదడును తొలిచేస్తోంది. మరి, ఈ కింది ప్రకటన చూసి మీరు ఏం అనుకుంటున్నారో చెప్పండి.

Read Also: భయానకం.. విమానం అద్దం పగిలి ఎగిరిపోయిన పైలట్, 23 వేల అడుగుల ఎత్తులో...

వీడియో:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.