యాప్నగరం

స్మోకింగ్ వదిలేసే ప్రయత్నంలో కన్నబిడ్డ బలి.. తల్లి నిర్లక్ష్య ఫలితం!

స్మోకింగ్‌ను వదిలించుకునే ప్రయత్నంలో ఆమె చిన్న పొరపాటు చేసింది. దాని వల్ల 19 నెలల బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు.

Samayam Telugu 17 Oct 2019, 7:48 pm
స్మోకింగ్‌కు బానిసైన ఓ మహిళ చిన్న పొరపాటు వల్ల తన బిడ్డను కోల్పోయింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన మహిళ తన స్మోకింగ్ అలవాటును మానేయాలని నిర్ణయించుకుంది. ఈ సందర్భంగా ఆమె లిక్విడ్ నికోటిన్ కొనుగోలు చేసింది. దాన్ని వేప్ జ్యూస్‌లో కలిపి ఈ-సిగరెట్ ద్వారా స్మోకింగ్ చేయడం అలవాటు చేసుకుంది.
Samayam Telugu GettyImages-984979480


ఆమె ఉద్దేశం మంచిదే అయినా చిన్న పొరపాటు వల్ల 19 నెలల బిడ్డనే కోల్పోవలసి వచ్చింది. లిక్విడ్ నికోటిన్ కలిపిన వేప్ జ్యూస్ బాటిళ్లను బయట వదిలపెట్టి ఇంట్లో పనులు చేసుకుంటుండగా.. చిన్నారి వాటిని తాగేశాడు. అయితే, ఈ విషయాన్ని ఆమె వెంటనే గుర్తించలేదు. బాటిళ్లను వేరే చోట పెట్టేందుకు సిద్ధమవుతుండగా ఒక బాటిల్ కనిపించలేదు. దీంతో కంగారు పడిన ఆమె చిన్నారి వద్దకు వెళ్లి చూడగా ఒక బాటిల్ నోటిలో ఉంది. కొద్దిసేపటి తర్వాత చిన్నారి అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు చిన్నారికి చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. దీంతో ఆ పసి ప్రాణం 11 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు.

స్మోకింగ్ అలవాటును వదిలించుకోడానికి ఆమె 18 నెలల కిందట లిక్విడ్ నికోటిన్‌ను అమెరికా నుంచి తెప్పించుకుంది. దాన్ని ఇ-సిగరెట్‌లో పొగకోసం వేసుకునే వేప్‌జ్యూస్‌లో కలుపుకుని స్మోక్ చేయడం అలవాటు చేసుకుంది. అయితే, ఆమె నిర్లక్ష్యం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది.

మీ ఇంట్లో కూడా చిన్నారులు ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చిన్న చిన్న వస్తువులు, క్లీనర్లు, యాసిడ్ బాటిళ్లను వారికి దూరంగా ఉంచండి. ఈ వార్తను షేర్ చేసుకుని మీ బంధుమిత్రులనూ అలర్ట్ చేయండి.
(Above pic: Representative image )

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.