యాప్నగరం

వాడేసిన కండోమ్‌ను పాము తలకు తొడిగారు.. ఇదేం క్రూరత్వం?

గుర్తుతెలియని ఆకతాయిలు ఓ పాము తలకు వాడేసిన కండోమ్ తొడిగి హింసించారు. జంతు ప్రేమికులు దాన్ని రక్షించారు.

Samayam Telugu 6 Jan 2021, 8:23 pm
మానవత్వం అర్థం మారిపోతోంది. భవిష్యత్తుల్లో ‘మానవత్వం’ అనే పదాన్ని క్రూరత్వానికి ప్రత్యామ్నయంగా మారవచ్చు. తోటి మనుషులతోనే కాకుండా జీవులను మనిషి గౌరవించాలి. అలా చేయకపోతే మానవత్వానికి అర్థమే ఉండదు. ముంబయిలో జరిగిన తాజా ఘటన గురించి తెలిస్తే.. మీరు తప్పకుండా చీదరించుకుంటారు.
Samayam Telugu Representational image
File photo used for representational purpose.


కండీవాలీ ఈస్ట్‌లోని మీడోస్ హౌసింగ్ సొసైటీలో ఓ వ్యక్తి కదల్లేని స్థితిలో ఉన్న పాము కనిపించింది. దాని తలకు వాడేసిన కండోమ్ తొడిగి ఉంది. దీంతో ఓ వ్యక్తి వెంటనే స్నేక్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఈ సమాచారం అందించాడు. దీంతో మిటా మాల్వాంకర్ అనే స్నేక్ రెస్క్యూ సభ్యురాలు అక్కడికి వెళ్లి పాము తలకు ఉన్న కండోమ్‌ను తొలగించి ప్రాణాలు కాపాడింది.
షాకింగ్.. ఆరేళ్లుగా హాస్పిటల్‌ వీడని కుటుంబం.. వార్డులోనే అన్నీ, చివరికి..
కండోమ్ తలకు బిగుసుకుని ఉండటం వల్ల పాము ఊపిరి ఆడక విలవిల్లాడిందని మిటా తెలిపింది. అయితే, పాము దానంతట అదే కండోమ్‌లోకి తల దూర్చే అవకాశం ఉండదని, తప్పకుండా ఇది ఆకతాయిల పనేనని పేర్కొంది. పాములను పట్టుకోవడం తెలిసిన వ్యక్తులే పైశాచిక ఆనందం కోసం పాము తలకు వాడేసిన కండోమ్‌ను తొడిగి హింసించి ఉంటారని తెలిపింది. పామును కాపాడిన తర్వాత సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌లోని వెటర్నరీ వైద్యులకు అప్పగించింది. చికిత్స తర్వాత దాన్ని అడవుల్లోకి వదిలిపెట్టారు. ఈ పనికి పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తి మీద కేసు నమోదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.