పెళ్లి వీడియోలన్నీ సంతోషంగా ఉంటాయి. ఫ్రెండ్స్, బంధువుల రాకతో పెళ్లి మండపం కళకళలాడుతూ ఉంటుంది. అందరి ముఖాల్లో చిరునవ్వులు విరబూస్తూ ఉంటాయి. అలాంటి ఎన్నో వీడియోలను మనం చూస్తూనే ఉంటాం. వాటికి పూర్తి భిన్నమైన వీడియో ఇది. పెళ్లిలో వధువు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న దృశ్యాన్ని షూట్ చేసిన కొందరు సోషల్ మీడియాకి ఎక్కించారు. అది కాస్తా వైరల్ అయ్యింది. ఇక ఎన్నో ప్రశ్నలు. ఆమె ఎందుకు అలా చేసింది అని. ఈ వీడియో వైరల్ అవ్వడంతో దీనిపై ఇప్పుడు డిబేట్ నడుస్తోంది. (angry bride video)
ఇన్‌స్టాగ్రామ్‌లోని Ghantaa పేజీలో ఈ వీడియోని 5 రోజుల కిందట పోస్ట్ చేశారు. దీన్ని లక్షల మంది చూడగా... 1.66 లక్షల మంది లైక్ చేశారు. దీన్ని గమనిస్తే... వధూవరులు హాలులో ఉన్న దృశ్యంతో ఈ క్లిప్ ప్రారంభమవుతోంది. వధూవరుల చుట్టూ బంధువులు ఉన్నారు. కొత్త జంట ఒకరి వరమాలను మరొకరు మార్చుకోవడం ద్వారా వరండాలో నిలబడి ఉన్నారు. ఆ తర్వాత వేడుకలో భాగంగా వధువుకు తినిపించమని వరుడికి మిఠాయి ఇచ్చారు పూజారి. వరుడు ఎడమ చేతితో ఆ స్వీట్‌ని వధువు నోట్లో పెట్టబోతుంటే ఆమె దాన్ని విసిరికొట్టింది. (bride angry to groom video)
ఆ తర్వాత వధువుకి ఓ గ్లాసు మంచినీళ్లు ఇచ్చిన పూజారి... వాటిని వరుడికి తాగించమని చెప్పారు. ఆమె కూడా ఎడమచేత్తో అందుకొని... వరుడి నోటికి అందించాలని చూసింది. వరుడు అడ్డుకున్నాడు. అంతే అసలే అగ్గిమీద గుగ్గిలమైన ఉన్న ఆమె... ఆ గ్లాసును గాల్లోకి విసిరేసింది. ఇలా ఆమె తన కోపాన్ని అక్కడ క్లియర్‌గా ప్రదర్శించింది. (wedding video)
ఆ వీడియోని ఇక్కడ చూడండి (viral video)
ఈ దృశ్యాన్ని ఎక్కడ, ఎప్పుడు చిత్రీకరించారనేది స్పష్టంగా తెలియదు. కానీ ఇది ఇప్పుడు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఆమెకు బలవంతంగా ఈ పెళ్లి చేసి ఉండొచ్చని కొందరు భావిస్తుంటే... మరికొందరు ఆ జంట ఎక్కువ కాలం కలిసి ఉండరని అంటున్నారు. చూస్తుంటే పెద్దలు కుదిర్చిన పెళ్లిలాగానే ఉంది. మరి ఎందుకిలా అవుతోంది అని కొందరు ప్రశ్నిస్తున్నారు. (viral news)
"వాళ్లకు ఇవ్వాల్సింది స్వీట్లూ, గ్లాసులూ కాదు విడాకులు" అని ఓ యూజర్ స్పందించగా... "ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం చేసే భర్త కావాలి" అని మరొకరు స్పందించారు. "పెళ్లి అయిపోయిందా లేదా" అని మరొకరు ప్రశ్నించారు. "ఎవడ్రా మిఠాయి, గ్లాసును నాపై విసిరింది" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.