యాప్నగరం

video: పల్టీలు కొట్టి.. పార్టులుగా విడిపోయి.. పేలిన రేస్ కారు

రేస్ కార్లు రివ్వున దూసుకుపోగలవు. ఐతే... రేసర్ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తీవ్రమైన ప్రమాదం జరగడం ఖాయం. అలాంటి ఓ రేస్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో ఓ రేసర్... కారును నడిపే సమయంలో జరిగిన అనూహ్యమైన దారుణం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. క్షణాల్లో ఆ కారు తుక్కుతుక్కవ్వడం మైండ్ బ్లాంక్ చేస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాన్ని చూసిన నెటిజన్లు బాబోయ్ అంటున్నారు. కార్ల రేస్ ఇంత డేంజరస్సా అంటున్నారు. ఎందుకో తెలుసుకుందాం.

Samayam Telugu 22 Feb 2022, 10:18 am
కొన్ని రకాల రోడ్డు ప్రమాదాలను చూసినప్పుడు మన హార్ట్ ఒక్కక్షణం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. వామ్మో అనుకుంటూ కళ్లార్పకుండా చూస్తాం. ఆ దృశ్యం మన మనసులో బలంగా ప్రింట్ అవుతుంది. అప్పుడే అనుకుంటాం అతివేగం అనర్థదాయకం అనీ, రోడ్లపై జాగ్రత్తగా డ్రైవింగ్ చెయ్యాలనీ. సరిగ్గా అలాంటి ఓ ఘటన అమెరికా... ఫ్లోరిడాలోని నాస్కార్ రేస్ (NASCAR race)లో జరిగింది. ఓ కారు గాల్లోకి లేచి పల్టీలు కొడుతూ... క్షణాల్లో భగ్గున పేలి... ముక్కలు ముక్కలుగా విడిపోయింది. ఆ కారు అంతలా ఎందుకు విడిపోయింది అన్నది ఆశ్చర్యం కలిగించే అంశం. (race car accident video)
Samayam Telugu పేలిపోయిన రేస్ కారు (image credit - youtube - NASCAR Railfan05)


ఇలాంటి ఘోర ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ చనిపోవడమో, గాయపడటమో జరుగుతుంది. కానీ ఈ ఘటనలో డ్రైవర్ మ్యాట్ స్నిడర్ (Myatt Snider) ఎలాంటి గాయాలూ లేకుండా బయటపడ్డాడు. (car accident video)

అంతా క్షణాల్లో:
డాయ్ టోనా దగ్గర ఎక్స్ ఫినిటీ సిరీస్ చివరి ల్యాప్ సమయంలో... స్నిడర్ కారు చెవ్రోలెట్... తన రైవల్స్ అయిన ఆంటోనీ ఆల్ ఫ్రెడో, జేడ్ బ్యూఫోర్డ్ కారులకు టచ్ అయ్యింది. ఆ సమయంలో బ్యాలెన్స్ తప్పి స్నిడర్ కారు... బ్యూఫోర్డ్ కారు ముందు భాగాన్ని ఢీకొని... పైకి లేచి... పక్కనున్న అవుట్ సైడ్ క్యాచ్ ఫెన్స్‌కి తగిలింది. దాంతో ముక్కలుగా విడిపోతూ... పల్టీలు కొడుతూ పేలింది. క్షణాల్లో కారులో పార్టులన్నీ విడిపోయి... స్కెలిటన్ లా మారింది. రేసింగ్ ల్యాప్ పై నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. (race car blast video)

ప్రమాదం జరిగిన వెంటనే మెడికోలు, అధికారులూ పరుగున వెళ్లి స్నిడర్‌ని కాపాడారు. అతన్ని సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లతో మంటల్ని అందుపులోకి తెచ్చారు.

ఆ వీడియోని ఇక్కడ చూడండి (viral video)

దూసుకెళ్లే కార్లు:
నాస్కార్ రేసులో కార్లు తరచూ గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. అంత వేగంతో వెళ్లేటప్పుడు ప్రమాదం జరిగితే ప్రాణాలు గాల్లో కలిసిపోయే అవకాశాలు ఎక్కువ. కానీ స్నిడర్ ఏ గాయాలూ అవ్వకుండా బయటపడటం గొప్ప విషయమే. స్నిడర్‌ని దత్యోనా మెడికల్ సెంటర్ కి తీసుకెళ్లారు. కాసేపటి తర్వాత డిశ్చార్జ్ చేశారు.
video: అపార్ట్‌మెంట్‌లో మంటలు.. పిల్లల్ని కాపాడిన కుర్రాడిపై ప్రశంసలు
"ఇది హింసాత్మకంగా ఉంది. చుట్టూ నిప్పురవ్వలు చూశాను. అంతా అవే. ఏం జరుగుతుందో కూడా మనం ఊహించలేం" అని రిపోర్టర్లతో స్నిడర్ అన్నట్లు తెలిసింది.
video: దేవుడా.. కచోరీ కోసం రైలు ఆపాడు.. ఎలా సామీ ఇలాగైతే..

వీడియోని చూసి ఆశ్చర్యపోతూ నెటిజన్లు కామెంట్స్ ఇస్తున్నారు. "ఈ కార్లు సురక్షితమైనవని నేను అనుకోను" అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా... "ఆ కారు రూఫ్ గనుక ఢీకొట్టుకొని ఉంటే అతను చనిపోయేవాడు లేదా గాయపడేవాడు. అదృష్టం కొద్దీ అతను సేఫ్ గా తప్పించుకున్నడు" అని మరో యూజర్ స్పందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.