యాప్నగరం

video: ఆమెతో అతను.. కాలితో తన్నిన ఒంటె.. ఫన్నీ వైరల్ వీడియో

ఈ సరదా వీడియో అందరికీ తెగ నచ్చుతోంది. అసలు ఆ ఒంటె అతన్ని ఎందుకు కాలితో తన్నింది అనేది... కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నట్లుగా వైరల్ అవుతోంది. అందుకే ఈ వీడియో సోఖల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తోంది. దాన్ని ఓసారి చూద్దాం.

Samayam Telugu 11 Feb 2022, 10:28 am
ఇంటర్నెట్ ఒక అద్భుతమైన ప్రపంచం. ఆహ్లాదకరమైన, వెంటనే నవ్వించే వీడియోలకు అక్కడ లోటు లేదు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త వీడియోలు, క్లిప్పింగ్స్ వస్తూనే ఉంటాయి. వాటిలో చాలా వీడియోని మన దృష్టిని ఆకర్షిస్తాయి. కొన్ని దృశ్యాల్ని కళ్లారా చూసినా నమ్మలేం. అదెలా జరిగింది? అలా ఎందుకు జరిగింది? అని ప్రశ్నించుకుంటాం. ముఖ్యంగా జంతువులు, పక్షుల వీడియోలు మనల్ని బాగా నవ్విస్తాయి. అవి రొటీన్ లైఫ్ స్టైల్ కి భిన్నంగా ఉండటం వల్ల వాటిని చూసినప్పుడు మన మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. అలాంటి ఓ వీడియో ఇప్పుడు అందర్నీ నవ్విస్తోంది. (camel kicked man video)
Samayam Telugu అతన్ని కాలితో తన్నిన ఒంటె (image credit - twitter - @susantananda3)


ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) ఆఫీసర్ సుశాంత నందా తన ట్విట్టర్ ఖాతా @susantananda3లో ఈ వీడియోని ఫిబ్రవరి 7న పోస్ట్ చేశారు. "ఈర్షతో తన్నింది" అని సరదా క్యాప్షన్ పెట్టారు. ఇది జస్ట్ 4 సెకండ్ల నిడివి ఉన్న వీడియో మాత్రమే. కానీ ఇది అందరికీ నవ్వు తెప్పిస్తోంది. చాలా మంది ఐదారుసార్లు దీన్ని ప్లే చేసి చూస్తున్నారు. అందుకే దీనికి 52వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 3వేలకు పైగా లైక్స్ వచ్చాయి. (camel attack man video)

ఈ వీడియో క్లిప్ ని గమనిస్తే... ఓ ఎడారిలో ఓ అందమైన అమ్మాయి పక్కన ఓ వ్యక్తి కూర్చొని ఉన్నాడు. వాళ్ల వెనుక ఒంటెల గుంపు ఉంది. ఒంటెలు అటూ ఇటూ వెళ్తుండగా, ఒక ఒంటె అకస్మాత్తుగా ఆ వ్యక్తిని వెనుక కాలితో తన్నింది. ఊహించని ఈ ఘటనతో అతను కలవరపడితే.. పక్కనే ఉన్న మహిళ ఓదార్చిన తీరును ఈ క్లిప్‌లో చూడొచ్చు.

ఆ వీడియోని ఇక్కడ చూడండి (viral video)

ఈ వీడియోని ఎప్పుడు, ఎక్కడ రికార్డ్ చేశారో స్పష్టంగా తెలియదు. ప్రస్తుతం ఇది నెటిజన్లకు బాగా నచ్చుతోంది. దీనిపై వారు సరదా కామెంట్స్, ఫన్నీ ఇమోజీలు పోస్ట్ చేస్తున్నారు.
video: ఘోర రోడ్డు ప్రమాదం.. కుర్రాణ్ని ఢీకొట్టిన సైకిల్.. వీడియో వైరల్
"అతను ఆమెతో కూర్చోవడం ఒంటెకు నచ్చలేదు" అని ఒకరు కామెంట్ ఇవ్వగా... "వాలెంటైన్స్ డే నాడు జంటను చూసినప్పుడు నా ఫీలింగ్" అని మరో యూజర్ ఫన్నీ కామెంట్ ఇచ్చారు. "ఆ ఒంటె గత జన్మలో ప్రేయసి" అని మరో యూజర్ సరదా కామెంట్ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.