యాప్నగరం

ఆకాశంలో ఒకేసారి ఐదు సూర్యుళ్లు ప్రత్యక్షం.. అబ్బురపరుస్తున్న వీడియో

ఆకాశంలో మీరెప్పుడైనా ఐదు సూర్యుళ్లను ఒకేసారి చూశారా? అయితే, మీరు తప్పకుండా చైనాలో చోటుచేసుకున్న ఈ వింతను చూడాల్సిందే.

Samayam Telugu 18 Feb 2020, 4:14 pm
కాశంలో మనకు ఒకే సూర్యుడు కనిపిస్తాడనే సంగతి తెలిసిందే. కానీ, ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియాలో ఓ విచిత్రం చోటుచేసుకుంది. ఆకాశంలో ఒకేసారి ఐదు సూర్యుళ్లు ప్రత్యక్షమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. మరి, ఆకాశంలో ఒకేసారి ఐదు నక్షత్రాలు కనిపించడం సాధ్యమేనా? ఆ వీడియోలో ఆకాశంలో కనిపించిన ఆ మిగతా నాలుగు వెలుగులు ఏమిటీ? ఎక్కడి నుంచి వచ్చాయి? దీనిపై నిపుణులు ఏమంటున్నారనేది తెలుసుకొనే ముందు ఈ వీడియోను ఒక్కసారి చూడండి.
Samayam Telugu Screengrab from Twitter video
Screengrab from Twitter video


వీడియో:
Also Read: ఫొటో కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన యువతి, 3000 అడుగుల ఎత్తైన శిఖరమెక్కి..

ఆకాశంలో ఇలా ఐదు నక్షత్రాలు కనిపించడమనేది కేవలం దృష్టిభ్రాంతి మాత్రమేనని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పుడు గాలిలో ఉండే ఐస్ క్రిస్టల్స్ (మంచు స్ఫటికాలు) మీద సూర్య కిరణాలు పడతాయని, వాటి ప్రతిబింబాలు సూర్యుడిని పోలి ఉండటం వల్ల మనకు ఆకాశంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ సూర్యుళ్లు కనిపిస్తున్న భ్రమ కలుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు. దీన్ని ‘సన్‌డాగ్’ లేదా ‘ఫాంటమ్ సన్’ అని పిలుస్తారు.

Also Read: వేగంగా వెళ్తున్న రైలు నుంచి దిగబోయిన యువకుడు, చివరికి.. (వీడియో)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.