యాప్నగరం

కొండ చిలువను కాపాడేందుకు నూతిలోకి యువకుడు, పట్టుతప్పడంతో..

కొండ చిలువను కాపాడేందుకు అతడు తన ప్రాణాలను ఫణంగా పెట్టాడు. తాడు సాయంతో నూతిలోకి దిగి పామును శరీరానికి చుట్టుకుని పైకి ఎక్కబోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ వీడియోలో చూడండి.

Samayam Telugu 12 Dec 2019, 7:37 pm
కేరళాలోని త్రిస్సూర్‌లో ఓ కొండ చిలువ నూతిలో చిక్కుకుంది. ఈ సమాచారం అందుకున్న త్రిస్సూర్ అటవీ పర్యవేక్షకుడు షాగిల్ అక్కడికి చేరుకుని కొండ చిలువను రక్షించేందుకు సిద్ధమయ్యాడు. తాడు సాయంతో నూతిలోకి దిగిన త్రిస్సూర్.. ఒక చేత్తో కొండ చిలువ, మరో చేతితో తాడును పట్టుకుని నూతి నుంచి పైకి వచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే, కొండ చిలువను చూసిన గ్రామస్తులు షాగిల్ చేయి పట్టుకుని పైకి లాగడంలో విఫలమయ్యారు. దీంతో షాగిల్ పాముతోపాటు నూతిలో పడిపోయాడు.
Samayam Telugu 115


వీడియో:
Also Watch: వామ్మో.. చిరుతపులి, కుక్క మీదకు దూకి పీక పట్టుకుని.. కెమేరాకు చిక్కిన ఘటన

గ్రామస్తులు వెంటనే తాడును నీటిలో వేసి షాగిల్‌ను బయటకు లాగారు. ఈ సందర్భంగా షాగిల్ మాట్లాడుతూ.. ‘‘నూతిలో కొండ చిలువను చూడగానే.. దాన్ని ట్రాప్ సాయంతో పట్టుకుందామని ప్రయత్నించాం. కానీ, అది ఎంతకీ చిక్కలేదు. చాలాసేపు ప్రయత్నించి అలసిపోయాం. మరోదారి లేకపోవడంతో తాడు పట్టుకుని నూతిలోకి దిగేందుకు ప్రయత్నించా. చెట్టు కొమ్మ సాయంతో కొండ చిలువను నా వైపు లాక్కున్నా. దాని తలను పట్టుకుని పైలేపాను. దాన్ని నా శరీరానికి చుట్టుకుని పైకి ఎక్కడానికి ప్రయత్నించా. ఒకరిని నా చేయి పట్టుకోవాలని అడిగాను. మరి వారు నా చేతిలో కొండ చిలువను చూసి భయపడ్డారో ఏమో.. నన్ను వదిలేశారు. దీంతో నూతిలో పడిపోయా. నూతి నుంచి బయటకు వచ్చిన తర్వాత మరో విధానంలో కొండ చిలువను బయటకు తీసుకొచ్చాం’’ అని తెలిపాడు.

Also Read: హ్యాండ్ పంపు నుంచి నీటికి బదులు రక్తం, మాంసం.. భయపడుతున్న ప్రజలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.