యాప్నగరం

‘ఉమ్మి’ రొట్టెలు.. పెళ్లి విందు ఆరగిస్తున్నారా? ఇది చూస్తే కడుపులో తిప్పుతుంది

అసలే కరోనా వైరస్.. అందులో పెళ్లి. ఇలాంటి సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వేడుకలు జరుపుకోవాలి. ఈ నేపథ్యంలో పెళ్లి విందులో తందూరీ రోటీలు తయారు చేసే వ్యక్తి చేసిన పని చూస్తే తప్పకుండా మీకు కడుపులో తిప్పేస్తుంది.

Samayam Telugu 23 Feb 2021, 10:02 am
పెళ్లి విందు అంటే ఎవరు ఇష్టముండదు చెప్పండి? అతిథుల్లో సగం మంది.. నోరూరించే రకరకాల వంటకాలను కడుపు నిండా ఆరగించడానికే వెళ్తుంటారు. అయితే, ఈ వీడియో చూస్తే.. భవిష్యత్తులో పెళ్లి విందుకు వెళ్లాలంటేనే భయపడిపోతారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకున్న ఓ పెళ్లిలో ఏం జరిగిందో చూడండి.
Samayam Telugu video of man allegedly spitting on tandoori rotis while cooking at wedding in up goes viral
‘ఉమ్మి’ రొట్టెలు.. పెళ్లి విందు ఆరగిస్తున్నారా? ఇది చూస్తే కడుపులో తిప్పుతుంది


ఫిబ్రవరి 16న అరోమా గార్డెన్‌లో ధూమ్‌ధామ్‌గా పెళ్లి జరిగింది. విందుకు కూడా ఏర్పాట్లు భారీగానే చేశారు. అయితే, అక్కడ తందూరీ రోటీలు తయారు చేస్తున్న వంటగాడు చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది. తందూరీలో కాల్చడానికి ముందు అతడు రోటీల్లో ఉమ్ముతున్నాడు. దీంతో కొందరు దీన్ని వీడియో తీశారు. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు అంతా ముక్కు, మూతికి మాస్కులు ధరిస్తుంటే.. అతడు ఏకంగా రోటీల్లో ఉమ్ములు వేయడం చూసి అంతా షాకవ్వుతున్నారు. ఆ విందు తిన్నవాళ్లు ఆ వీడియో చూస్తే ఏమైపోతారో అని నెటిజనులు జాలిపడుతున్నారు.

వీడియో:
కడుపులో తిప్పే ఈ వీడియోను @anamikamber అనే యూజర్.. మీటర్ పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. దీంతో పోలీసులు ఆ పెళ్లి ఎక్కడ జరిగిందో తెలుసుకుని విచారణ మొదలుపెట్టారు. నిందితుడు నౌషద్ అలియాస్ సోహైల్‌ అని గుర్తించారు. అతడిపై ఐపీసీ 268, 269, 188 కింద కేసులు నమోదు చేశారు. సోహైల్‌కు సుమారు మూడేల్లు శిక్ష పడే అవకాశం ఉంది.
యువకుడి నోట్లో నోరు పెట్టి.. నాలుక ఊడపీకి.. పక్షికి ఆహారంగా వేసిన యువతి, చివరికి..నిందితుడిని పట్టుకొనేందుకు అడ్వకేట్ యశోద యాదవ్, హిందూ జాగరణ్ మంచ్ కార్యకర్తలు సహకరించినట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై హిందూ జాగరణ్ మంచ్ అధ్యక్షుడు సచిన్ సిరోహీ మాట్లాడుతూ.. పెళ్లిల్లో మళ్లీ ఇలాంటివి చోటుచేసుకోకుండా ఉండేందుకు సీసీటీవీ కెమేరాలను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.