యాప్నగరం

పిల్ల ఏనుగుకు తల్లి ఏనుగు పాఠాలు.. గడ్డిని ఎందుకు ఊపిందో తెలుసా?

ఏనుగులు మనుషుల లాగే తెలివైనవి. ఎప్పుడు ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో వాటికి బాగా తెలుసు. తాజాగా ఓ తల్లి ఏనుగు... పిల్ల ఏనుగుకు చెప్పిన పాఠం అందర్నీ ఆకట్టుకుంటోంది.

Samayam Telugu 5 Jan 2022, 7:31 pm
మనలో చాలా మంది బిజీ లైఫ్‌ కారణంగా ప్రకృతిని గమనించే టైమ్ ఉండదు. ఆకాశంలో మేఘాలు, రాత్రిళ్లు మెరిసే నక్షత్రాలు, పచ్చటి మైదానాలు, ఎగిరే పక్షులు ఇవన్నీ మనకు సహజసిద్ధమైనవి. వీటిని చూసేటప్పుడు మన మెదడులో కణాలు ఉత్తేజితం అవుతాయి. మనసులో ఉండే భారాన్ని తగ్గించగలిగే శక్తి (Natural Healing) వీటికి ఉంది. అందుకే కనీసం వీడియోలు, ఫొటోలలోనైనా ప్రకృతిని చూస్తే... మానసిక ఒత్తిళ్లు తగ్గించుకోవచ్చు. మరి ఆ ఏనుగు చెప్పిన పాఠమేంటో తెలుసుకుందాం.
Samayam Telugu ఏనుగు పాఠం (image credit - twitter - @kaziranga_)


అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్‌లో ఏనుగు వీడియో వైరల్ అయ్యింది. పార్క్ నిర్వాహకులు ట్విట్టర్ అకౌంట్‌లో వీడియోని పోస్ట్ చేశారు. ఇందులో... కజిరంగా పార్కులోని గడ్డి మైదానాల్లో ఓ తల్లి ఏనుగు పిల్ల ఏనుగును వెంట తీసుకెళ్లింది. అక్కడ గడ్డిని ఎలా తినాలో నేర్పుతోంది (Kaziranga National Park video).

గడ్డి తినడం కూడా పెద్ద మ్యాటరేనా అని మనకు అనిపించవచ్చు. అక్కడే ఓ ముఖ్యమైన విషయం ఉంది. ముందుగా ఆ తల్లి ఏనుగు... నీటిలో గడ్డి ఉన్న ప్రాంతాన్ని వెతికి అక్కడికి గున్న ఏనుగును తీసుకెళ్లింది. అక్కడ గడ్డిని తొండంతో తెంపి... దాన్ని అటూ ఇటూ ఊపింది. తద్వారా గడ్డిపై ఉన్న ఈగలు, దోమల వంటి వాటిని తరిమేసింది. ఆ తర్వాత ఆ గడ్డిని నీటిలో అటూ ఇటూ జాడించింది. తద్వారా గడ్డిపై ఉన్న దుమ్ము, గడ్డి వేర్లకు ఉండే మట్టి కూడా తొలగిపోయింది. ఆ తర్వాత ఆ గడ్డిని తినేసింది. ఇదంతా పిల్ల ఏనుగు చూసింది. ఇలా మంచి గడ్డిని ఎలా తినాలో నేర్పించింది. తినే ఆహారం మంచిది అయితేనే ఆరోగ్యంగా ఉంటామనే సందేశం ఇచ్చింది ఆ ఏనుగు. (Mother elephant feeding her baby).

ఆ వీడియో (elephant video)ని ఇక్కడ చూడండి

డిసెంబర్ 29న పోస్ట్ చేసిన ఈ వీడియోని ఇప్పటికే 45వేల మందికి పైగా చూశారు. చాలా మంది దీనిపై స్పందిస్తున్నారు. "అందమైన ఫుటేజ్. షేర్ చేసినందుకు థాంక్స్" అని ఓ నెటిజన్ స్పందించగా... "తెలివైన జంతువులు" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. "ఈ రోజు ఇది చూడటం చాలా ఆనందంగా ఉంది" అని మరో యూజర్ స్పందించారు.

viral video: అడవిపంది కోసం సింహాల ప్లాన్.. వ్యూహాత్మకం
"తల్లి తల్లే" అని నాలుగో యూజర్ కామెంట్ ఇవ్వగా... "తల్లి నుంచి అందమైన సీన్. చక్కటి నేచర్" అని మరో యూజర్ స్పందించారు. ఇలా చాలా మంది పాజిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.