యాప్నగరం

దుస్తులు విప్పేసి.. అండర్‌వేర్‌తో షాపింగ్, ఎందుకంటే...

ఓ వ్యక్తి అండర్ వేర్‌తో షాపింగ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో మారింది. అయితే, అతడు అలా చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది.

Samayam Telugu 26 Oct 2020, 8:22 pm
Samayam Telugu Image Credit: YouTube
వ్యక్తి దుస్తులన్నీ విప్పేసి.. కేవలం అండర్‌వేర్ మాత్రమే ధరించి షాపింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. యూకేలోని వేల్స్‌లో చోటుచేసుకున్న చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఎవరా వ్యక్తి? దుస్తులు విప్పేసి.. అండర్‌వేర్‌తో షాపింగ్ చేయాలని అతడికి ఎందుకు అనిపించింది?

లాక్‌డౌన్‌లో భాగంగా వేల్స్‌లోని షాపింగ్ మాల్స్‌లో దుస్తులు, షూలు, బొమ్మలు, బెడ్డింగ్ వస్తువుల అమ్మకాలను నిలిపివేశారు. కేవలం నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసేందుకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. న్యూపోర్ట్‌కు చెందిన 38 ఏళ్ల క్రిస్టోఫర్ నాడెన్ అనే వ్యక్తికి ఇది అస్సలు నచ్చలేదు. దీంతో నాడెన్ తన నిరసన వ్యక్తం చేసేందుకు దుస్తులన్నీ విప్పేసి మాల్‌లోకి ఎంటరయ్యాడు. ఇదంతా అతడి భార్య మొబైల్‌లో రికార్డ్ చేసింది.

Read Also: ఆమె వంట చేస్తే మరణమే.. మనుషుల్లేని దీవిలో 30 ఏళ్లు బంధించి శిక్ష!

అతడు అలా అర్ధనగ్నం రావడం చూసి సెక్యూరిటీ సిబ్బంది షాకయ్యారు. దుస్తులు వేసుకుని వస్తేనే ప్రవేశం ఉంటుందని చెప్పేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే తాము దుస్తులు విక్రయించడం లేదని, మీరు ఇలా దుస్తులు విప్పేసి షాపింగ్ చేయరాదని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. దీనిపై మీరు ప్రభుత్వాన్నే ప్రశ్నించాలని, మా వద్ద నిరసన వ్యక్తం చేయడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు.

వీడియో: దీనిపై నాడెన్ స్పందిస్తూ.. ‘‘నేను ఇదేదో జోక్ కోసమో.. సరదా కోసమో చేయలేదు. ప్రభుత్వం కళ్లు తెరిపించాలనే ఇలా చేశాను. దుస్తులను నిత్యవసర వస్తువుల్లో చేర్చలేదు. వాటిని నాన్-ఎసెన్షియల్ జాబితాలో పెట్టారు. అంటే.. ప్రజలకు దుస్తులు అవసరం లేదనేగా అర్థం’’ అని లాజిక్ చెప్పాడు. నాడెన్ చెప్పింది కూడా నిజమే కదూ!!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.