యాప్నగరం

నమ్మలేని నిజం.. ఎలుకలూ మనుషుల్లా కార్లు నడిపేస్తున్నాయ్, ఇదిగో సాక్ష్యం!

ఎలుకలు కార్లు నడపగలవంటే నమ్మగలరా? ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు. వాటి తెలివి తేటలకు ఫిదా అవుతారు.

Samayam Telugu 26 Oct 2019, 6:15 pm
లుకలు మనుషుల్లా కార్లు నడుపుతున్నాయంటే ఎవరూ నమ్మరు. అవి గేర్లు, బ్రేకులు ఎలా వేస్తాయి? చిత్రం కాకపోతే అనే సందేహం కూడా కలుగుతుంది. అందుకే.. అమెరికాలోని వర్జినియాలో గల రిచ్మండ్ యూనివర్శిటీ పరిశోధకులు వాటి కోసం ప్రత్యేక కార్లను రూపొందించి ప్రయోగాలు చేపట్టారు. ఎలుకలూ కార్లను నడపగలవని నిరూపించారు.
Samayam Telugu Representational Image


Also Read: మంచం విరగొట్టిన కూతురు, కోర్టుకెక్కిన తల్లి.. నిజం తెలిసి కోర్టులో నవ్వులే నవ్వులు!

పరిశోధకులు ఈ ప్రత్యేక కార్లలో ఎలుకలను ఉంచి.. ఓ పెద్ద గాజు డబ్బాలో పెట్టారు. అందులో ఒక పక్కన వాటికి ఇష్టమైన ఆహారాన్ని పెట్టారు. కారులో నుంచి బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో ఎలుకలు తప్పకుండా కారు నడపాలి. ఆ కారును నడపాలంటే ఎలుకలు తన తెలివి తేటలను ఉపయోగించాలి.

Also Read: వామ్మో.. అతడి కడుపులోనే బీర్ తయారువుతోంది, అరుదైన వ్యాధితో అవస్థలు!

అద్భుతం.. ఆ ఎలుకలు కారును నడిపాయి. ఆహారం వద్దకు చేరేందుకు అవి ఆ కార్లను డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాయి. విజయవంతంగా తమకు నచ్చిన ఆహారాన్ని ఆరగించాయి. పరిశోధకులు మొత్తం 11 మగ, 6 ఆడ ఎలుకలపై ఈ ప్రయోగం చేశారు. అనుభవం ఉన్న డ్రైవర్లలా అవి ఆ కార్లను నడపడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. వాటి డ్రైవింగ్‌ను ఈ కింది వీడియోలో చూడండి.

వీడియో:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.