యాప్నగరం

viral video: పులి, ఎలుగుబంటి మధ్య యుద్ధం.. చివర్లో ఊహించని ట్విస్ట్

ఆ పులి... ఎలుగుబంటిని టార్గెట్ చేసింది. అదే సమయంలో ఎలుగు బంటి పోరాడింది. ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు? చివర్లో ట్విస్ట్ ఏంటి?

Samayam Telugu 1 Jan 2022, 3:51 pm
వైల్డ్ లైఫ్ వీడియోలు ఎప్పుడూ మనల్ని నిరాశ పరచవు. వాటిలో థ్రిల్ ఉంటుంది. కన్నార్పకుండా చూసేలా చేసే కోణం వాటిలో ఉంటుంది. అందుకే వైల్ట్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు అడవుల్లో తిరుగుతూ అరుదైన ఫొటోలు, వీడియోలూ తీస్తుంటారు. వాటికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంటుంది. మరి తాజా వీడియో సంగతేంటో చూద్దాం (tiger vs bear fight video).
Samayam Telugu పులి వర్సెస్ ఎలుగుబంటి (ప్రతీకాత్మక చిత్రాలు images credit - pixabay)


ఈ వీడియో ఓ సఫారీలో తీసినది. ఇందులో ఓ పులి, ఎలుగుబంటి కొట్టేసుకున్నాయి. జనరల్‌గా పులులు ఎలుగుబంట్ల జోలికి వెళ్లవు. జింకలు, దుప్పులు, మేకలు, దూడల్ని ఆహారంగా తింటుంటాయి. ఎలుగుబంట్లు కూడా పులులకు దొరకకుండా చెట్లపై దాక్కుంటాయి. అందువల్ల వీటి మధ్య పోరాటం అరుదుగా కనిపిస్తుంది. తాజాగా అలాంటి ఓ వీడియో వైరల్ అవుతోంది (fight between tiger and bear video).

ఎలుగుబంటిని తినేద్దామనుకున్న పులి... దాన్ని టార్గెట్ చేసింది. ఐతే... ఎలుగు రివర్స్ అయ్యింది. తన కాళ్లకు ఉండే పదునైన గోళ్లతో... పులిపై విరుచుకుపడింది. దాంతో పెద్ద పులికి ఒకింత భయం వేసింది. ఎప్పుడైతే టైగర్ వెనక్కి జంకుతోందో ఇక బేర్‌కి ధైర్యం వచ్చేసింది. తన పోరాటాన్ని కొనసాగిస్తూ... పులి వెంట పడింది. దాంతో పులి పరుగు అందుకుంది. నన్ను వదిలేయ్ బాబోయ్ అన్నట్లుగా... ఓ నీటి కొలనులోకి పారిపోయింది. దాంతో ఎలుగు వెళ్లిపోయింది. ఆ తర్వాత పులి తాపీగా నీటిలోనే ఉండి... బతికిపోయాను అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది.

ఇలా ఎలుగు చేతిలో ఓడిపోయిన పులి వీడియో (wildlife video)ని ఇక్కడ చూడండి

మరో కోణం:
పై వీడియో చూశాక... పులి ఓడిపోవడం మనకు ఆశ్చర్యం కలిగించడం సహజం. ఇందుకో ఓ బలమైన కారణం చెబుతున్నారు కొందరు వన్యప్రాణుల ప్రేమికులు. ఆ ఎలుగు, పులి మధ్య యుద్ధం జరగలేదనీ... అవి రెండూ ఆడుకుంటున్నాయని కొందరు అంటున్నారు. ఆల్రెడీ పొట్ట నిండుగా ఉన్న పులి... ఎలుగుతో సరదాగా పోరాడిందే తప్ప దాన్ని చంపేసే ఉద్దేశంతో లేదని అంటున్నారు. ఎలుగు కూడా పులితో సరదాగానే పోరాడిందని చెబుతున్నారు. ఆట తర్వాత ఆలసిన పులి... సేద తీరేందుకు నీటిలోకి వెళ్లిందని అంటున్నారు. పులి నిజంగా దాడి చేస్తే... ఎలుగుబంటి ఓడిపోవడం ఖాయం అంటున్నారు.
viral video: క్యూట్ నక్క.. బాంజో సంగీతం వినేందుకు వస్తోంది
కర్ణాటకకు చెందిన ఫొటోగ్రాఫర్ బోస్కీ ఖన్నా ఈ వీడియోని తన ట్విట్టర్ అకౌంట్ @BoskyKhanna‌లో పోస్ట్ చేశారు. "ఈ యుద్ధంలో ఎవరు గెలిచారో ఊహించండి" అని ఆమె క్యాప్షన్ పెట్టారు. అందువల్ల ఇది ఆట కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజం ఏదైనా సరే... ఈ వీడియో మాత్రం నెటిజన్లకు నచ్చుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.