యాప్నగరం

సూపర్ ఉమెన్.. ఒక పూటలో ఏడాదికి సరిపడా కూరగాయలను కోసేసింది!

రోజూ కూరగాయలు కోయడానికి విసుగెత్తిపోయిన ఆ ఇల్లాలు.. ఒక పూటలో ఏడాదికి సరిపడా కూరగాయలను కోసేసి ఔరా అనిపించింది.

Samayam Telugu 13 Apr 2019, 5:06 pm
రోజూ కూరగాయలు కోసి కోసి విసుగెత్తిపోయిందో ఏమో.. ఆస్ట్రేలియాకు చెందిన మహిళ ఏకంగా ఒకే పూటలో ఏడాదికి సరిపడా కూరగాయలను కోసి ఫ్రిజ్‌లో పెట్టింది. సాధారణంగా చాలామంది త్వరగా వంట చేయడానికి ఒక రోజు ముందే కూరగాయలను కోసి సిద్ధం చేసుకుంటారు. కానీ, ఆమె ఏడాదికి సరిపడా కూరగాయలను కోసిందంటే నిజంగా చిత్రమే.
Samayam Telugu 6655525


రోజూ కూరగాయలు కోయడానికి ఎక్కువ సమయం పడుతుందనే ఉద్దేశంతో ఆమె.. వంట గదిలో ఝాన్సీ రాణి అవతారం ఎత్తింది. కనిపించిన కూరగాయలను.. దొరికింది దొరికినట్లు తురిమేస్తూ ఒక్క పూటలోనే పని పూర్తి చేసింది. మొత్తం 65 కిలోల కూరగాయలను ఆమె చకచకా ముక్కలు చేసింది. వీటిలో 20 కిలోల బంగాళా దుంపలు, 15 కిలోల క్యారెట్లు, 15 కిలోల చిలకడ దుంపలు, 10 కిలోల టమోటాలు, ఉల్లిపాయలు తదితర కూరగాయలు ఉన్నాయి. కోసిన ముక్కలను అందంగా ప్యాక్ చేసి ఫ్రిజ్ మొత్తాన్ని నింపేసింది.
‘‘ప్రతి రోజు పిల్లలకు వంట చేయడానికి, రాత్రి డిన్నర్‌కు కూరగాయలు కోయడం పెద్ద పనిగా ఉంది. అందుకే, మొత్తం ఏడాదికి సరిపడా కూరగాయలను కొనుగోలు చేసి ఒక్కసారే కట్ చేసేసి.. ఫ్రిజ్‌లో పెట్టేశాను. ఇకపై ఏది కావాలన్న వెంటనే తీసుకుని వంట పూర్తి చేసేయగలను’’ అని ఆమె తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.