యాప్నగరం

నలుగురిని ప్రేమించిన యువతి.. లక్కీ డ్రా తీసిన గ్రామ పెద్దలు, ఇదో విలేజ్ లవ్‌స్టోరీ!

ఒక యువతి నలుగురితో లవ్‌లో పడింది. ఇటీవల వారితో జంప్ అయ్యింది. గ్రామస్తులు ఎట్టకేలకు ఆ ఐదుగురిని తిరిగి ఊరికి తీసుకొచ్చారు. అయితే, ఆమె నలుగురిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలో తెలియక గందరగోళానికి గురైంది. దీంతో గ్రామ పెద్దలు ఇలా చేశారు.

Samayam Telugu 6 Mar 2021, 7:47 pm
మె మనసు చాలా విశాలమైనది. అందుకే, ఒకేసారి నలుగురు కుర్రాళ్లను ప్రేమించింది. అంతేకాదు.. ఆ నలుగురితో కలిసి జీవించేందుకు ఇంట్లో నుంచి పారిపోయింది. ఆ నలుగురు యువకుల కుటుంబికుల్లో ఒకరికి వారి ఆచూకీ లభించింది. దీంతో ఆ ఐదుగురిని తిరిగి గ్రామానికి తీసుకొచ్చారు. నలుగురిలో ఒకరిని ఎంపిక చేసుకుంటే పెళ్లి చేస్తామని కుటుంబికులు చెప్పారు. అయితే, ఆమె తనకు నలుగురు ఇష్టమేనని.. ఎంపిక చేసుకోవడం కష్టంగా ఉందని తెలిపింది. దీంతో ఈ రచ్చ.. రచ్చబండకు ఎక్కింది. పంచాయతీ పెద్దలకు కూడా ఆమె అదే విషయం చెప్పింది. దీంతో పెద్దలు లక్కీ డ్రా ద్వారా ఆమెకు భర్తను ఎంపిక చేశారు.
Samayam Telugu Representational Image


ఈ అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో అంబేద్కర్ నగర్‌లో చోటుచేసుకుంది. అజ్మీర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నలుగురు యువకులు.. తండా పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఉన్న యువతి ప్రేమలో పడ్డారు. ఆమె కూడా ఆ నలుగురిని పీకల్లోతు ప్రేమించింది. ఇటీవల ఆ నలుగురితో ఇంటి నుంచి జంప్ అయ్యింది. ఈ విషయం తెలిసి యువతి కుటుంబికులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే గ్రామ పెద్దలు వారిని వారించారు.

Read Also: మిస్సైన ఆ విమానం 35 ఏళ్ల తర్వాత.. 92 అస్థిపంజరాలతో ల్యాండైంది!

మొత్తానికి ఆ ఐదుగురిని తిరిగి ఊరికి తీసుకొచ్చిన గ్రామస్తులు.. వారిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఆమె ఎవరిని పెళ్లి చేసుకోవాలో నిర్ణయించుకోలేక గందరగోళానికి గురైంది. దీంతో పంచాయతీ పెద్దలు వారి కుటుంబికులతో సమావేశమయ్యారు. ఆ నలుగురికి ఒక్కరిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని యువతికి చెప్పారు. అప్పటికీ ఆమె తన నిర్ణయం చెప్పలేకపోయింది. దీంతో వేరే మార్గం లేక లక్కీ డ్రా చేయాలని నిర్ణయించారు. నలుగురు యువకుల పేర్లను నాలుగు చీటీలపై రాసి ఓ పాత్రలో పెట్టారు. యువతి ఆ నాలుగు చీటిల్లో ఒకటి తీసింది. అందులో ఎవరు పేరు ఉంటే.. వారినే పెళ్లి చేసుకోవాలని పెద్దలు చెప్పడంతో ఆమె అంగీకరించింది. మొత్తానికి కథ అలా సుఖాంతమైంది. కానీ, మిగతా ముగ్గురిపై ఆమె ప్రేమను చంపుకోగలదా? అనేదే పెద్ద ప్రశ్న!!

Read Also: రాక్షసులు.. తలలు నరికి డ్రైనేజీలో పాడేశారు, శవాలను రేప్ చేశారు.. ఆకృత్యాలకు అంతం లేదా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.