ఆ కారులో ఆమె మాత్రమే ఒంటరిగా ప్రయాణిస్తోందని అనుకుంది. కానీ, ఆమెకు తెలియకుండానే ఓ ఊహించని అతిథి గుట్టుచప్పుడు కాకుండా కారులో ప్రయాణిస్తోంది. కారులో ఉండే గ్లోవ్ కంపార్టమెంట్(వాహనాల్లో ముందు వైపు చిన్న చిన్న వస్తువులు ఉంచే చోటు) కదులుతున్నట్లుగా అనిపించింది. డ్రైవింగ్లోనే ఏమిటా అని దాన్ని తెరిచి చూసిన ఆ మహిళకు గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే.. అందులో ఓ పాము ఆమె కోసమే ఎదురుచూస్తున్నట్లు కూర్చొని ఉంది.
ఆస్ట్రేలియాలోని క్లరెండాన్లో చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కారు గ్లోవ్ కంపార్టమెంట్ నుంచి పామును బయటకు తీసే వీడియోను ‘ఆండ్రూస్ స్నేక్ రిమూవల్’ అనే ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేశారు. కారులో పామును చూడగానే ఆమె వెంటనే కారును పక్కన పార్క్ చేసి పాములను పట్టుకునే ఆండ్రూ స్మెడ్లేకు ఫోన్ చేసింది. అక్కడికి చేరుకున్న ఆండ్రూ పాము తోక పట్టుకుని నెమ్మదిగా బయటకు తీశాడు. అనంతరం దాన్ని అడవుల్లో వదిలిపెట్టాడు. అవి విషపూరిత ‘రెడ్ బెల్లీడ్ బ్లాక్ స్నేక్’ అని, ఇది ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపించే అరుదైన పామమని ఆండ్రూ తెలిపాడు. చూశారుగా.. ఈ సారి మీరు కారులో ప్రయాణిస్తున్నప్పుడు తప్పకుండా చెక్ చేసుకోండి. లేకపోతే చాలా ప్రమాదం.
వీడియో: