యాప్నగరం

రెండు తలలు, మూడు చేతులతో పుట్టిన అవిభక్త కవలలు

మధ్యప్రదేశ్‌లో ఓ మహిళకు రెండు తలలు, మూడు చేతుల అభిభక్త కవలలు జన్మించారు. పూర్తి వివరాలు, ఫొటోలను ఈ కథనంలో చూడగలరు.

Samayam Telugu 26 Nov 2019, 9:08 pm
ధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాకు చెందిన బబితా అహిర్వార్ (21) అనే మహిళ అవిభక్త కవలలకు జన్మనిచ్చింది. 3.3 కిలోల బరువున్న ఆ శిశువులు శరీరానికి రెండు తలలు, మూడు చేతులు ఉన్నాయి. ఆమె వైద్యం అందించిన డాక్టర్ సంజయ్ ఖేర్ మాట్లాడుతూ.. అల్ట్రాసౌండ్‌లో ఆమె కడుపులో కవల పిల్లలు పెరుగుతున్నట్లు తెలిసింది. కానీ, ఇలా కలిసి పుడతారని ఊహించలేకపోయామన్నారు. పిల్లల శరీరాలే కాకుండా అవయవాలు కూడా కలిసే ఉన్నాయని, ప్రస్తుతం పిల్లలను పరిశీలనలో ఉంచామని తెలిపారు.
Samayam Telugu gettyimages-1018811246-170667a


ఫొటోలను ఈ ట్వీట్‌లో చూడగలరు:
తండ్రి జస్వంత్ మాట్లాడుతూ.. ‘‘పరీక్షల్లో మాకు కవల పిల్లలు పుడతారని తెలిసింది. కానీ, రెండు తలలతో ఇలా శరీరాలు కలిసి పుడతారని అనుకోలేదు. పిల్లలను ఇలా చూడగానే నా భార్య తీవ్ర ఆందోళనకు గురైంది. ఈ బిడ్డ ఎలా ఉన్నా నేను పెంచుకోడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంటికి తీసుకెళ్తాం. జీవితాంతం ప్రేమగా చూసుకుంటాం’’ అని తెలిపాడు.

Also Read: పాపం దొంగ.. 82 ఏళ్ల బామ్మ చేతిలో చావుదెబ్బలు, చివర్లో ట్విస్ట్ అదుర్స్!

Also Read: తల లేకుండా పుట్టిన శిశువు.. బతికేది కొన్ని గంటలే!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.