యాప్నగరం

షాకింగ్.. ఆ బ్యూటీ క్వీన్ ఉదర భాగాన్ని తొలగించారు!

తినే ఆహారం కడుపులోకి చేరుతుందనే సంగతి తెలిసిందే. కానీ, ఈ బ్యూటీ క్వీన్‌కు కడుపే లేదు. దీనివల్ల రెండుసార్లు చావును చూసి వచ్చింది. చివరికి అందాల భామ కిరీటాన్ని దక్కించుకుంది.

Samayam Telugu 18 Oct 2019, 2:06 pm
మెరికాకు చెందిన చెస్నీ మన్రో బెర్జీన్స్ అనే బ్యూటీ క్వీన్ ఓ షాకింగ్ నిజాన్ని వెల్లడించింది. తనకు ఉదర భాగం లేదని, వైద్యులు తొలగించారని తెలిపింది. ఇప్పుడు ఆమె ఉదరం (కడుపు) లేకుండానే జీవిస్తోంది. 23 ఏళ్ల వయస్సులో ఆమెకు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చింది. ఆమె కుటుంబంలో అంతా క్యాన్సర్‌ వ్యాధితో చనిపోవడంతో ఆమె ఆందోళనకు గురైంది.
Samayam Telugu GettyImages-1081345954


అప్పటికే చెస్నీకి క్యాన్సర్ ముదరడంతో కిమోథెరఫీ, రేడియేషన్‌లతో ట్రీట్మెంట్ చేయడం సాధ్యం కాదని వైద్యులు చెప్పేశారు. దీంతో క్యాన్సర్ సోకిన ఉదర భాగాన్ని మొత్తం తొలగించారు. కడుపు లేకపోవడం వల్ల ఆమె ఆహారం తీసుకోవడానికి చాలా ఇబ్బందిపడ్డానని తెలిపింది. శరీరానికి తగిన పోషకాలు అందకపోవడంతో రెండుసార్లు చావును చూసి వచ్చానంది.

ఉదర భాగాన్ని తొలగించడం వల్ల ఆమె ఏ ఆహారం తీసుకున్నా కష్టంగా ఉండేది. చాలా తక్కువ మోతాదులో తీసుకోవల్సి వచ్చేది. ఆహారం జీర్ణమయ్యే అవకాశాలు సన్నగిల్లడంతో బాగా నమిలి తినాల్సి వచ్చేది. ‘‘నేను కడుపు లేకుండా ఎలా బతుకుతున్నానని చాలామంది ఆశ్చర్యపడేవారు. నేను తీసుకునే డైట్, వ్యాయామం మళ్లీ నన్ను సాధారణ మనిషిని చేశాయి. మరోవైపు ఆమె కుటుంబంలో ఉన్న రొమ్ము క్యాన్సర్ ముప్పుకు కూడా ఆమె చికిత్స చేయించుకోవలసి వచ్చింది.

‘‘నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే నా భర్తే కారణం. ఆయన నాకు ఎంతో సాయం చేసేవారు. నా ఆరోగ్యం కోసం తపనపడేవారు’’ అని ఆమె తెలిపింది. అలా మూడేళ్లపాటు నరకయాతన అనుభవించిన చెస్నీ.. 2018లో ‘మిసెస్ టెక్సాస్‌’ కిరీటాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత మిసెస్ అమెరికాలో ఆమె 6వ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఆమె చెప్పిన వాస్తవం విని అంతా షాకయ్యారు. ఎందుకంటే.. ఆమె మిసెస్ టెక్సాస్ గెలిచే వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. ‘‘మనలో వైఫల్యాలు ఉండవచ్చు. కానీ, దాని గురించే ఆలోచించి కుంగిపోకుండా మనకు నచ్చినది చేసుకొని పోతే.. ఏదైనా సాధించవచ్చు’’ అంటూ తనలా కష్టాలను ఎదుర్కొంటున్న తోటి మహిళలకు చెస్నీ స్ఫూర్తిగా నిలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.