యాప్నగరం

సాహసమే ఊపిరి... ఆ యువకుడి వీడియో చూసి నెటిజన్ల ప్రశంసల జల్లు

నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయేవారికి ఆ యువకుడు కొండంత ధైర్యం. అతని వీడియో చూస్తే చాలు... భయానికి తలవంచకుండా పట్టుదలతో సాధించాలనే ఆలోచన కలగడం సహజం.

Samayam Telugu 11 Oct 2021, 3:39 pm
శరీరంలో అన్ని అవయవాలూ ఉన్నవారు... తమలో దాగిన శక్తియుక్తుల్ని, ప్రతిభా పాటవాల్ని పూర్తిగా ఉపయోగించరు. అంత అవసరం వారికి రాదు. కానీ దివ్యాంగులైన వారు తమ వైకల్యానికి తల వంచకుండా... ధైర్యంగా ముందడుగు వేస్తారు. తమ సమస్యకు కుమిలిపోకుండా... విధి రాతను సైతం ఎదిరించి.. ధీశాలులై నిలబడతారు. అందుకోసం వారు తమలో నైపుణ్యాలనూ, ప్రతిభనూ బలంగా తట్టిలేపుకుంటారు. అలాంటి వారు సమాజాన్ని ఆశ్చర్యపరచగలరు (inspirational video). తాజా వీడియో (stunning video)లో కుర్రాడు అదే చేస్తున్నాడు. అతని ధైర్యం, సాహసం ముందు విధి తలవంచుతోంది.
Samayam Telugu సాహసమే ఊపిరి (image credit - twitter - @AwanishSharan)
సాహసమే ఊపిరి (image credit - twitter - @AwanishSharan)


ఈ వీడియో (viral video)ని IAS ఆఫీసర్ అవనీష్ శరణ్ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఇది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా వీడియోలో దృశ్యం ఆశ్చర్యపరుస్తోంది. ఇందులో దివ్యాంగుడైన ఓ కుర్రాడికి ఒకటే కాలు ఉంది (physically challenged). కానీ అతను రోజూ తన ఉద్యోగం కోసం సైకిల్‌పై వెళ్తున్నాడు. ఎడమ కాలితో సైకిల్ పెడల్ తొక్కుతూ... కుడి పెడల్‌పై ఓ కర్రను ఉంచి ముందుకు సాగుతున్నాడు. ఆ కర్రను అతను కుడి చేతితో పట్టుకున్నాడు. అందువల్ల అతను సైకిల్‌ హ్యాండిల్‌ను ఎడమ చేత్తో మాత్రమే పట్టుకున్నట్లైంది. ఇది ఎంతో రిస్కుతో కూడిన సైక్లింగ్. కానీ అతని సాహసమే శ్వాసగా సాగిపోతున్నాడు.

ఆ వీడియోని ఇక్కడ చూడండి:


52 సెకండ్ల ఈ వీడోయోలో ఆ కుర్రాడు అలా వెళ్లడం చూసిన ఓ టూవీలర్.. అతన్ని చూసి ఇంప్రెస్ అయ్యి... వివరాలు అడిగి తెలుసుకున్నారు. టూవీలర్ వ్యక్తే కాదు.. ఈ వీడియో చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. అతని ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.
సడెన్‌గా నిద్రలేచిన మహిళ.. ఇంటిపైన కన్నం.. తలగడపై ఉల్క రాయి!
"ఇది నిజంగా ప్రేరణ కలిగిస్తుంది" అని ఓ యూజర్ చెప్పగా... "మనసుంటే మార్గం ఉంటుంది" మరో యూజర్ స్పందించారు. ఇంకో యూజర్ ఈ వీడియోని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాకు షేర్ చేశారు. "అతను నా హీరో" అని ఓ మహిళా యూజర్ ప్రశంసించగా... సెల్యూట్ చేస్తున్నట్లు కామెంట్ ఇచ్చారు మరో యూజర్. ఇలా ప్రతి ఒక్కరూ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.