యాప్నగరం

Video: డ్రెస్సులు మార్చేస్తూ యువతి మ్యాజిక్.. అందరూ చూస్తుండగానే.!

ఆమె చిటికేస్తే డ్రెస్ మారిపోతోంది. చేతులు ఊపితే డ్రెస్ మారిపోతోంది. కదిలితే మారుతోంది... ఏం చేసినా డ్రెస్ మారిపోతోంది... ఆ మ్యాజిక్ ఎలా చేసిందో చూడండి.

Samayam Telugu 8 Dec 2021, 12:28 pm
మ్యాజిక్ ఎలాంటి వారినైనా ఆశ్చర్యపరచగలదు. ముఖ్యంగా... ఇంద్రజాలికులు కనికట్టు చేస్తూ... మన కళ్లను మాయ చేస్తూ... నమ్మలేని విధంగా చేస్తారు. టోపీలో రిబ్బన్ వేసి... పావురాన్ని బయటకు తీస్తారు. బోనులో మనిషిని బంధించి... సింహంలా మార్చేస్తారు (magic show videos). ఇదంతా నిజం కాదని మనకు తెలుసు... కానీ నిజమే అనిపించేలా చేస్తారు. అదే మ్యాజిక్ మాయ. కాలానికి తగ్గట్టే ఈ మ్యాజిక్‌లో కూడా మార్పులు వస్తున్నాయి. ఇదివరకటి లాగా... ఊళ్లకు వెళ్లి లేదా స్కూళ్లకు వెళ్లి మ్యాజిక్ ప్రదర్శన ఇవ్వట్లేదు. అవి కూడా ఆన్‌లైన్‌లోకి వచ్చేశాయి. తమ టాలెంట్‌ను ఇంటర్నెట్ ద్వారా ప్రపంచానికి చూపిస్తున్నారు. తాజాగా ఓ యువతి... చేసిన డ్రెస్ ఛేంజ్ మ్యాజిక్ (dress change magic) షో... ఫేస్‌బుక్‌లో వైరల్ అయ్యింది. ఆ వీడియోని ఇప్పటికే 12 లక్షల మంది చూశారు.
Samayam Telugu ఇది ఎలా సాధ్యం (image credit - facebook - P ᴀ ʀ ᴀ ᴅ ɪ S ᴇ)


వీడియోలో ఏముంది?
ఆ వీడియోలో ఓ యువతి... స్టేజీపై... వెంటవెంటనే తన డ్రెస్‌లను మార్చేస్తోంది (Woman Change Clothes on Stage). ఆడియన్స్ చూస్తుండగానే... క్షణాల్లో ఆమె డ్రెస్సులు మారిపోతున్నాయి. మొదట్లో జీబ్రా క్రాసింగ్ వైట్ డ్రెస్సులో కనిపించిన యువతి... మెట్లు దిగీ దిగగానే... గ్రీన్ కలర్‌ డ్రెస్‌లోకి వచ్చేసింది. అదెలా చేసిందో ఆడియన్స్‌కి అర్థం కాలేదు. ఆ వెంటనే ఆమె... అక్కడి ఓ బొమ్మకు ఉన్న ఎల్లో కలర్ డ్రెస్ నుంచి ఆ ఎల్లో కలర్‌ను తీసేసుకుంది. ఆ కలర్‌ని తన డ్రెస్‌కి అంటించుకుంది. అంతే ఆమె డ్రెస్ ఎల్లో కలర్‌లోకి మారిపోయింది. ఆ తర్వాత వెంటనే ఆమె డ్రెస్‌ను పింక్ కలర్ లోకి మార్చేసుకుంది. వెంటనే ఆమె చెయ్యి ఊపగానే... పింక్ కలర్ డ్రెస్ పోయి... బ్లాక్ కలర్ డ్రెస్ వచ్చేసింది. ఇలా చాలా చేసింది. 3 నిమిషాల వీడియో (Magic Video)లో ఆమె రకరకాల డ్రెస్సులు మార్చేసింది. ఇదంతా చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఆ వీడియో (viral video)ని ఇక్కడ చూడండి

ఫేస్‌బుక్‌లోని P ᴀ ʀ ᴀ ᴅ ɪ S ᴇ పేజీలో ఈ వీడియోని పోస్ట్ చేశారు. 16వేల మందికి పైగా దీన్ని లైక్ చేశారు. అసలు ఇలా డ్రెస్సులు ఎలా మార్చేస్తోంది అనే దానిపై నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Funny Video: భార్యపై ప్రేమ ఎక్కువైంది.. ఎత్తుకోబోయి చిత్తైన భర్త!
"ఆమె బెలూన్స్ వేసుకున్నట్లు ఉంది" అని ఓ నెటిజన్ కామెంట్ ఇచ్చారు. "ఆమె ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ బాగున్నాయి" అని మరొకరు స్పందించారు. "అది కలర్ ఎఫెక్ట్" అని ఓ యూజర్ చెప్పగా... "ఇది ఎలా సాధ్యం... నిజంగా ఇది మ్యాజిక్ లాగా ఉంది" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. "వేల సంవత్సరాలుగా ఉన్న ప్రాక్టీస్‌ని ఆమె కొనసాగిస్తోంది" అని మరో యూజర్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.