యాప్నగరం

అద్భుతం.. ఇది మనిషి కాదు కేకు, ఇంకా ఇలాంటివి ఎన్నో!

బెంగళూరులో నిర్వహిస్తున్న కేకుల ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ ఆకారాల కేకులు భలే ఆకట్టుకుంటున్నాయి.

Samayam Telugu 20 Dec 2019, 12:37 pm
పుట్టిన రోజులకు వివిధ పండుగలు, వేడుకలకు వివిధ రూపాల్లో కేకులను ఆర్డర్ చేయడం సాధారణమే. ఈ నేపథ్యంలో బేకరీలకు చిరునామాగా పేర్కొనే బెంగళూరులో అద్భుతమైన కేకులను ప్రదర్శనకు ఉంచారు. సెయింట్ జోసఫ్ ఇండియన్ హైస్కూల్ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన 23 పైగా కేకు మోడళ్లు ఆహార ప్రియులను ఔరా అనిపిస్తున్నాయి.
Samayam Telugu 23 cake models on display at bengaluru cake show main attraction is kathakali dancer
అద్భుతం.. ఇది మనిషి కాదు కేకు, ఇంకా ఇలాంటివి ఎన్నో!


విభిన్న కేకులను ఈ కింది ట్వీట్లో చూడండి:


చంద్రయాన్-2 మొదలుకుని, కథాకళి డ్యాన్సర్, సెయింట్ బాసిల్ క్యాథెడ్రాల్ తదితర మోడళ్లను ఇక్కడ ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. డిసెంబరు 13న మొదలైన ఈ కేకుల ప్రదర్శన జనవరి 1, 2020 వరకు కొనసాగుతుంది. ఈ కేకుల్లో ఎక్కువ మందిని ఆకట్టుకుంటున్నది కథాకళి కేకు. దీన్ని చూడగానే మనిషే నిలుచున్నాడనే భావన కలుగుతోందని సందర్శకులు తెలుపుతున్నారు. మీరు బెంగళూరులో ఉన్నట్లయితే తప్పకుండా ఈ ప్రదర్శన చూడండి.

Watch: అత్యాచారానికి గురైన కూతురిని వీపుపై మోస్తూ.. హాస్పిటల్‌లో చేర్చిన తండ్రి

Also Read: 3 రోజులు నీళ్లు ఇవ్వని తల్లి.. దప్పికతో టాయిలెట్ నీళ్లు తాగి బాలిక మృతి, చిన్నారి కన్నీటి గాధ!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.