యాప్నగరం

మూడేళ్ల బాలుడి మంచి మనసు.. కప్ కేకులు చేసి, 50 వేలు విరాళం ఇచ్చాడు

మూడేళ్ల బాలుడు స్వయంగా కప్ కేకులు తయారు చేసి.. వాటిని విక్రయించగా వచ్చిన మొత్తం నగదును పోలీసులకు విరాళంగా ఇచ్చి తన పెద్ద మనసు చాటాడు. నిజంగా ఈ బుడతడు గ్రేట్ కదూ.

Samayam Telugu 13 May 2020, 5:57 pm
పిల్లాడి వయస్సు కేవలం మూడేళ్లే. అయితే, చిన్న పిల్లాడే కదా అని అతడిని తక్కువ అంచనా వేయొద్దు. ఇతడు తయారు చేసే కప్పు కేకులను రుచి చూస్తే.. ‘వావ్’ అనకుండా ఉండరు. ఆ కేకుల్లాగే ఈ పిల్లాడి మనసు కూడా చాలా స్వీట్. అందుకే, తాను ఎంతో కష్టపడి తయారుచేసిన ఆ కప్పు కేకులను విక్రయించి.. ఆ మొత్తాన్ని పోలీసులకు విరాళంగా అందించాడు.
Samayam Telugu Photo: Mumbai Police/Twitter


ముంబయికి చెందిన ఈ బుల్లి బేకరీ వ్యాపారి పేరు కబీర్. కరోనా వైరస్ నేపథ్యంలో ముంబయి పోలీసులు చేస్తున్న సేవలకు గాను ఈ బుడతడు రూ.10 వేలు విరాళంగా ఇద్దామని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా తానే స్వయంగా కప్ కేకులు తయారు చేశాడు. వాటిని విక్రయించగా.. ఆశించిన మొత్తం కంటే ఎక్కువ వచ్చాయి. మొత్తం రూ.50 వేలు లభించాయి.

Also Read: థాంక్యూ పోలీస్.. ఆ బాలికకు బైక్ కొనిచ్చారు, ఎందుకంటే..

దీంతో మంగళవారం ఉదయం కబీర్ తన తల్లిదండ్రులు కరిష్మా, కేశవ్‌లతో కలిసి ముంబయి పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్‌ను కలిశారు. రూ.50 వేల చెక్కుతోపాటు.. కబీర్ తయారు చేసిన కప్పు కేకుల బాక్సును వారికి కానుకగా అందించారు. కబీర్ ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు ఆశ్చర్యపోయిన పోలీసులు ట్విట్టర్ ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఈ మూడేళ్ల బేకర్ కబీర్.. తన కష్టంతో విలువ కట్టలేని సాయం అందించాడు. ఈ తీపి గుర్తు మా మనస్సుల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది’’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఆ బాలుడి పెద్ద మనసుకు ఫిదా అవుతున్నారు. అంత కష్టపడి సంపాదించిన మొత్తాన్ని విరాళంగా ఇవ్వడం నిజంగా గ్రేట్ అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.