యాప్నగరం

మూడేళ్లుగా టాయిలెట్‌లోనే నివసిస్తున్న వృద్ధురాలు

దేశంలో పేదల దుర్భర పరిస్థితులకు అద్దంపట్టే ఘటన ఇది. పాపం ఆ అవ్వ.. మూడేళ్లుగా టాయిలె‌ట్‌లోనే నివసిస్తోంది. ఈ విషయం తెలిస్తే.. ప్రభుత్వం అది కూడా మిగల్చదేమో!

Samayam Telugu 10 Dec 2019, 7:22 pm
దేశంలో పేదరికం రూపుమాపడం.. నల్ల ధనాన్ని తిరిగి తీసుకురావడం అనేది కలలో కూడా జరగని పని మనకు తెలిసిందే. రాజకీయ పార్టీలు, నాయకుల స్వార్థం వల్ల దేశం ఇంకా వందేళ్ల వెనక్కే ఉందనే సంగతి ఇలాంటి ఘటనలను చూస్తేనే అర్థమవుతుంది. దేశంలో కనీసం కూడు, గూడుకు నోచుకోని ప్రజలకు కొదవేలేదు. ఈ అవ్వ కూడా ఆ కోవకు చెందినదే.
Samayam Telugu 72 year old woman has been living in a toilet for the last 3 years in mayurbhanj
మూడేళ్లుగా టాయిలెట్‌లోనే నివసిస్తున్న వృద్ధురాలు


ఒడిశాలోని మయూర్భాంజ్ గ్రామానికి చెందిన 72 ఏళ్ల ద్రౌపతి బెహరా అనే గిరిజన మహిళ.. మూడేళ్లుగా టాయిలెట్‌లోనే నివసిస్తోంది. సొంతవారు ఎవరూ లేకపోవడంతో అందులోనే ఒంటరిగా జీవిస్తోంది. అందులోనే వంట చేసుకుంటూ.. అందులోనే నిద్రపోతూ దయనీయ జీవితం గడుపుతోంది.
ఆమె దీనావస్థను చూసి కనీసం ఆదుకొనేవారు కూడా లేరు. గ్రామస్తులు, బంధువులు ఆమెను అనాథగా వదిలేశారు. ఆమె గురించి ఆ గ్రామ సర్పంచి బుధురాం పుటిని ప్రశ్నించగా.. ఆమెకు ఇల్లు నిర్మించేందుకు తనకు అధికారం లేదని సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ పథకాల ద్వారా ఆమెకు ఇల్లు మంజురైతే మాత్రమే సాయం చేయగలమని చెప్పారు. పాపం.. ఆ అవ్వ ఇంకా ఎన్నాళ్లు దుర్భర పరిస్థితుల్లో జీవించాలో!

Also Read: అమ్మ మనసు.. ఆట మధ్యలో బిడ్డకు పాలిచ్చిన వాలీబాల్ క్రీడాకారిణి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.