యాప్నగరం

viral photo: డ్రాగన్ లాంటి జీవి?.. సముద్రంలో కనిపెట్టిన జాలరి

ఈమధ్య కొత్త కొత్త విషయాలు తెలుస్తాయని టైమ్ ట్రావెలర్లుగా చెప్పుకుంటున్నవాళ్లు అంటున్నారు కదా... కానీ ఈ వింత జీవి గురించి మాత్రం వాళ్లు చెప్పలేదు. ఈ జీవి... చూడటానికి డ్రాగన్‌ లాగా ఉందని అంటున్నారు. మరి ఇది ఎక్కడ కనిపించింది? దీని గురించి ఆ జాలరి ఏం చెబుతున్నారు? అసలు అది డ్రాగనేనా? లేక ఏదైనా చేప.. డ్రాగన్ లాగా కనిపిస్తోందా? చైనా పురాణాల్లో చెప్పుకునే డ్రాగన్లు నిజంగానే ఉన్నాయా? ఇలా చాలా అంశాలపై చర్చ జరిగేందుకు ఈ కొత్త జీవి కారణం అవుతోంది.

Samayam Telugu 7 Apr 2022, 9:33 am
రష్యాకి చెందిన 39 ఏళ్ల జాలరి రోమన్ ఫెడోర్ట్‌సోవ్ (Roman Fedortsov).. సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లారు. విపరీతమైన చలిలో... రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి ఆలోచిస్తూ... పరధ్యానంగా ఉన్నాడు. మరుక్షణంలో ఆ ఆలోచనల నుంచి బయటపడి.. చేపలపై ఫోకస్ పెట్టాడు. సముద్రం లోపలికి వల లాంటిది వేశారు. తిరిగి పైకి తీశాడు. చాలా చేపలు వచ్చాయి. వాటిలో ఒకటి మాత్రం అతను ఆశ్చర్యపోయేలా చేసింది. దాన్ని మొదట చూడగానే... "వామ్మో ఏంటిది" అని భయపడ్డాడు. తర్వాత జాగ్రత్తగా చూశాడు. అదేంటో అతనికి అర్థం కాలేదు. దాన్ని ఫొటో తీసి.. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. (bizarre looking creature)
Samayam Telugu డ్రాగన్ లాంటి జీవి?.. కనిపెట్టిన జాలరి (image credit - https://www.instagram.com/p/CbSmWjKMEqb/)


అది చూసిన నెటిజన్లు వెంటనే స్పందించారు. దాని రెక్కలు, తోక చూస్తుంటే... అదో పిల్ల డ్రాగన్ (baby dragon) లాగా ఉంది అంటున్నారు. మర్మాన్స్క్ కి చెందిన అతను... దాని ఫొటోతోపాటూ వరైటీ క్యాప్షన్ ఇచ్చాడు. జీ ఎఫ్ లవ్ క్రాఫ్ట్ చేసిన సూక్తి (quote)ని క్యాప్షన్‌లో పెట్టాడు. "ఇదేదో పేరు లేనిది. కానీ తేడాగా ఉన్నది కనిపించింది" అని తెలిపాడు. (strange creature)

ఈ జీవికి పెద్ద కళ్లు, పొడవైన తోక ఉన్నాయి. చూడటానికి లైట్ పింక్ కలర్‌లో ఉంది. దానికి రెక్కలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ జీవిని ఇక్కడ చూడండి
View this post on Instagram A post shared by Роман Федорцов (@rfedortsov_official_account)

ఈ ఫొటోని లక్షల మంది చూడగా... 22వేల మందికి పైగా లైక్ చేశారు. ఎప్పుడైతే ఇది వైరల్ అయ్యిందో... నిపుణులు కూడా దీనిపై ఫోకస్ పెట్టాడు. అలాంటి వారిలో ఒకరు.. ఇది ఘోస్ట్ షార్క్ (ghost shark) అని తెలిపారు. ఐతే... ఇది కచ్చితంగా ఘోస్ట్ షార్కేనా అన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది. షార్క్ చేపలకు కళ్లు పెద్దవిగానే ఉంటాయి. అందువల్ల ఇది ఘోస్ట్ షార్క్ అయ్యే అవకాశాలున్నాయి.

నెటిజన్లు మాత్రం దీన్ని వింత జీవిగానే చూస్తున్నారు. "ఇది చేప అని నాకు అనిపించట్లేదు" అని ఓ యూజర్ చెప్పగా... "దీన్ని చూడగానే ఇదో కొత్తరకం చికెన్ శాండ్ విచ్ అనుకున్నాను" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.
video: 2 నిమిషాల్లో 2 కేజీల చేపలు 2 పట్టాడు.. మతిపోయే టెక్నిక్
"మన సముద్రాల లోతుల్లో తెలియని జీవులు చాలా ఉన్నాయి. ఇది వాటిలాగే ఉంది" అని మరో యూజర్ తెలిపారు. దీన్ని పట్టుకున్న రోమన్ జాలరి.. ఇలాంటి విచిత్రమైన జీవుల్ని తాను తరచూ ఉత్తర రష్యా వైపు ఉన్న నార్వే, బారెంట్స్ సముద్రాల్లో పట్టుకుంటున్నట్లు తెలిపారు. అట్లాంటిక్ సముద్రం లోతుల్లో ఇలాంటివి ఉంటున్నాయని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.