యాప్నగరం

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన యాంకర్ లాస్య

యాంకర్, నటి లాస్య పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఉగాది పర్వదినాన్న అభిమానులతో ఈ శుభవార్తను పంచుకుంది.

Samayam Telugu 6 Apr 2019, 2:44 pm
తెలుగు టీవీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ లాస్య. యాంకరింగ్‌ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు సినిమాలు, సీరియల్స్‌లో కూడా నటిస్తూ బోలెడంత వినోదం పంచిన లాస్య మంజునాథ్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత టీవీ రంగానికి దూరమైంది. కొద్ది నెలల కిందట తాను అమ్మని కాబోతున్నట్లు గుడ్‌న్యూస్ కూడా వినిపించింది.
Samayam Telugu Untitled1


శనివారం ఉదయం పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరిన లాస్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ‘‘దాదాపు 14 గంటల ప్రయత్నంతో నువ్వు బయటకు వచ్చావు. మమ్మల్ని కలుసుకున్నావు. నిన్ను చూసిన ఆనందానికి నేను పడిన ఆ నొప్పుల బాధ కూడా మాయమైంది. నీ మొదటి ఊపిరి, నీ మొదటి ఏడుపు.. ఎంతో సంతోషాన్ని నింపింది. మా పార్థనలకు సమాధానం నువ్వు’’ అంటూ లాస్య తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ ఉగాది తమకు ఎంతో ప్రత్యేకమని, తమ జీవితంలో ఆనందాన్ని నింపిందని లాస్య పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.