యాప్నగరం

2,500 ఏళ్ల కిందట దాచిన ఆ గుడ్లు.. ఇప్పుడు బయటపడ్డాయి!

ఆర్కియాలజిస్టులు జరిపిన తవ్వకాల్లో గుడ్లతో నిండిన కుండ కనిపించింది. 2,500 నాటి ఆ గుడ్లు ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం గమనార్హం.

Samayam Telugu 28 Mar 2019, 2:59 pm
చైనా ఆర్కియాలజిస్టుల తవ్వకాల్లో ఓ కుండ దొరికింది. దాని నిండా గుడ్లు ఉండటం చూసి అంతా ఆశ్చర్యపోయారు. అందులో మొత్తం 20 గుడ్లు ఉన్నాయని, వాటిలో ఒక గుడ్డు మాత్రమే పగిలిందని, మిగిలినవి చెక్కుచెదరలేదని ఆర్కియాలజిస్టులు తెలిపారు. దాదాపు 2,500 ఏళ్ల కిందట వీటిని కుండలో దాచి పెట్టి ఉండవచ్చని అంచనా వేశారు.
Samayam Telugu 1553749927-Eggs1


షాంగ్ జింగ్ నగరంలో అత్యంత పురాతనమైన సమాధుల వద్ద నాంజింగ్ ఆర్కియాలజికల్ ఇనిస్టిట్యూట్, లియాంగ్ మ్యూజియంలకు చెందిన ఆర్కియాలజిస్టులు తవ్వకాలు జరుపుతున్నారు. పూర్తిగా మట్టితో కప్పబడి ఉన్న ఆ ప్రాంతంలో లభించిన ఆధారాల ప్రకారం.. ఒకప్పుడు అక్కడ ప్రజలు జీవించేవారని తెలిసిందని ఆర్కియాలజిస్టులు తెలిపారు. అక్కడ కుండలో లభించిన గుడ్లు చెక్కు చెదరకున్నా.. వాటిలో ఉండే ద్రవ పదార్థం పూర్తిగా మాయమైందన్నారు. కేవలం గుడ్ల పెంకులు మాత్రమే పగలకుండా ఉన్నాయన్నారు. అయితే, అవి ఏ పక్షి గుడ్లనేవి ఇంకా తెలియరాలేదని, వాటిపై ప్రయోగశాలలో వివిధ పరీక్షలు జరపాల్సి ఉందని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.