యాప్నగరం

Video: ఊర్వశి రౌతేలా మ్యాజిక్.. గాల్లో కీరదోసకాయ!

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఊర్వశి రౌతేలా తాజాగా చేసిన మ్యాజిక్ వీడియో వైరల్ అవుతోంది. కీర దోసకాయతో ఆమె ఏం చేసిందో చూడండి.

Samayam Telugu 27 Oct 2021, 9:21 am
Urvashi Rautela: బాలీవుడ్ అందాల భామల్లో ఊర్వశి రౌతేలా ప్రత్యేకమైనది. 2015లో మిస్ దివ కిరీటాన్ని అందుకున్న ఈ బ్యూటీ... అదే ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంది. అప్పటికే సింగ్ సాబ్ ది గ్రేట్ (2013) సినిమాతో... బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత... సానమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4లో నటించి మెప్పించింది. ఎప్పటికప్పుడు ఫాలోయర్స్ సంఖ్యను పెంచుకుంటున్న ఊర్వశీ రౌతేలా సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక మార్క్ వేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్ ఇచ్చే ఈ భామకు ఇప్పటికే 4.19 కోట్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు. తాజాగా ఈ బ్యూటీ కీర దోసకాయతో మ్యాజిక్ చేసింది.
Samayam Telugu ఊర్వశి రౌతేలా (image credit - instagram - urvashirautela)


ఊర్వశి అప్‌లోడ్ చేసిన వీడియోలో... తన రెండు చేతులతో ముఖానికి ఎదురుగా ఓ కీర దోసకాయను పైన, కింద పట్టుకుంది. ఆ తర్వాత పై చేయిని వదిలేసింది. తర్వాత కింది చేతిని కూడా వదిలేసింది. అయినా కీర దోసకాయ కింద పడకుండా అలాగే ఉంది. ఇది ఎలా సాధ్యం.. ఇందులో ఏదైనా గ్రాఫిక్ ఉందా అని నెటిజన్లు ఆలోచించే లోపే... దాని ట్రిక్ ఏంటో చూపించింది (Urvashi Rautela magic video)

ఆ వీడియో (viral video)ని ఇక్కడ చూడండి.
View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela)

ఓ సింపుల్ మ్యాజిక్‌ని చాలా చక్కగా చేసిందని ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. జస్ట్ 8 గంటల కిందటే అప్‌లోడ్ చేసిన ఈ వీడియోని ఇప్పటికే 2.61 లక్షల మంది లైక్ చేశారు. చాలా మంది ఫన్నీ ఇమోజీలను కామెంట్లలో పెడుతున్నారు.

10 నెలల్లో రూ.20 లక్షలు సేవ్ చేసిన జంట.. ఎలా సాధ్యమైంది?
ఇలా ఊర్వశి రౌతేలా తరచూ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. యాడ్స్, ప్రమోషన్లు, బాలీవుడ్ ఆఫర్లతో ఈ అమ్మడు ఎప్పుడూ బిజీగా ఉంటోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.