యాప్నగరం

ప్రియురాలిపై పగ.. కారులో ఉండగానే మట్టితో కప్పెట్టేసిన ప్రియుడు

కారులో అనార్కలి.. ఆ యువకుడు తన ప్రియురాలిని అనార్కలిలా బంధించేందుకు ప్రయత్నించాడు. ఆమె కారు లోపల ఉండగానే మట్టితో కప్పేశాడు.

Samayam Telugu 26 Aug 2019, 3:50 pm
ప్రియురాలిపై కోపంతో ఓ యువకుడు ఆమెను కారులో పెట్టి మట్టితో కప్పేశాడు. ఈ ఘటన ఫ్లొరిడాలో చోటుచేసుకుంది. ఓక్లా కౌంటీకి చెందిన హంటర్ మిల్స్ ఇటీవల తన ప్రియురాలితో గొడవపడ్డాడు. సమస్యను మాట్లాడుకుని పరిష్కరించుకుందాం అంటూ ఓ ప్రాంతానికి పిలిచాడు. అయితే, సమస్య పరిష్కారం కాకపోగా మరింత పెద్దదైంది. ప్రియుడికి మరింత ఆగ్రహం కలిగించింది.
Samayam Telugu 68627813_10157286228543654_7928326624154484736_n


అతడు ముందుగానే ఆమె కారుపై దాడి చేయాలని ప్లాన్ చేసుకున్నాడో ఏమో.. ఓ బుల్‌డోజర్‌తో మట్టిని తవ్వుకొచ్చి కారును కప్పేశాడు. ఆ సమయంలో ఆమె కారులోనే ఉండటం గమనార్హం. కారును పూర్తిగా కప్పేయకపోవడం వల్ల ఆమెకు ప్రాణాలకు ఎలాంటి హానీ జరగలేదు. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ప్రియుడిని అరెస్టు చేశారు.
ఈ ఘటన వివరాలను ‘ఒకలూసా కౌంటీ షెరీఫ్ కార్యాలయం’ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చేసిన నెటిజనులు అతడి ప్రియురాలినే నిందిస్తున్నారు. అతడు అలా కారును మట్టితో కప్పేస్తుంటే ఆమె ఏం చేస్తుందని కొందరు సందేహం వ్యక్తం చేశారు. పారిపోడానికి సమయం ఉన్నా.. ఆమె కావాలనే కార్లు కుర్చుని ప్రియుడిని పోలీసులకు అప్పగించిందని కామెంట్ చేశారు. ఏది ఏమైనా.. ఈ ప్రేమికుల గొడవ చాలా చిత్రంగా ఉంది కదూ.

Read also: సెక్స్‌ చేద్దామని పిలిచి, నిద్రపోయాడని.. ప్రియుడిని ఇంట్లో బంధించి నిప్పు పెట్టింది!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.