యాప్నగరం

దోమలు పెంచుతున్న ‘జొమాటో’.. రూ.లక్ష జరిమానా!

ఆహారాన్ని సరఫరా చేసే ‘జొమాటో’ దోమలను తెగ పెంచేస్తోందట. దీంతో మున్సిపాలిటీ అధికారులు రూ.లక్ష బిల్లు పంపారు.

Samayam Telugu 21 Oct 2019, 5:02 pm
హారాన్ని సరఫరా చేసే ‘జొమాటో’ యాప్.. కొత్తగా దోమలు పెంచే బాధ్యతలు ఏమైనా తీసుకుందా అనే కదా మీ డౌట్? డోన్ట్ వర్రీ. అలాంటిది ఏమీలేదు. కానీ, వారు పరోక్షంగానే దోమలకు మేలు చేస్తున్నారు. వారి ఆఫీసు పరిసరాల్లో దోమలను విపరీతంగా పెంచుతూ.. వాటి కడుపు నింపుతున్నారు. ఫలితంగా.. మున్సిపాలిటీ అధికారులు రూ.లక్ష ‘బిల్లు’ వేశారు.
Samayam Telugu GettyImages-1162241906


Read also: తల్లి కళ్ల ముందే పిల్లల తలలు నరికి.. టీవీ ఎత్తుకెళ్లారు!

చెన్నైలోని జొమాటో ఆఫీసుపై అక్టోబరు 18న గ్రేటర్ కార్పొరేషన్ అధికారులు దాడులు జరిపారు. ఈ సందర్భంగా ఆఫీసు పరిసరాల్లో నిలిచిపోయిన నీటిని శుభ్రం చేయకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఆఫీసు పైన ఫుడ్ డెలివరీకి ఉపయోగించే నిరుపయోగ బ్యాగులను ఇష్టానుసారంగా పడేశారు. దీనివల్ల దోమలు అక్కడ నీరు నిలువ ఉండి దోమలు పెరుగుతున్నాయి.

Read also: కొడుకు పక్కలో శిశువు ఆత్మ.. భర్త తప్పిదంతో భార్య హడల్, చివరికి..

ఈ పరిస్థితుల వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందనే కారణంతో అధికారులు రూ.లక్ష జరిమానా విధించారు. దీనిపై స్పందించిన జొమాటలో అక్టోబరు 23న జరిమానా చెల్లిస్తామని వెల్లడించింది. తమిళనాడులో ఈ ఏడాది 3 వేల డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఐదుగురు చనిపోయారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ అధికారులు చెన్నై నలుమూలల తనిఖీలు ముమ్మరం చేశారు. దోమల వృద్ధికి కారణమవుతున్న వ్యక్తులకు, సంస్థలకు జరిమానాలు విధిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.