యాప్నగరం

‘మంగళ సూత్రంతో నగ్నం’గా.. చిక్కుల్లో నిర్వాహకులు!

ఓ కళాకారుడు ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శన వివాదస్పదమైంది. ఈ ప్రదర్శన ఆపాలంటూ కేసు కూడా నమోదైంది.

Samayam Telugu 22 Mar 2019, 4:46 pm
క్రియేటివిటీ హద్దులు దాటితే ఇలాగే ఉంటుంది. బెంగళూరులో ఓ కళాకారుడు ‘న్యూడ్ విత్ మంగళసూత్ర’ (మంగళ‌సూత్రంతో నగ్నంగా) పేరుతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు. దీనిపై హిందు, మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే ఆ ఎగ్జిబిషన్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ కళాకారుడిపై కేసు కూడా నమోదైంది.
Samayam Telugu 4762209-IQZPDMCU-6


సుజీత్ కుమార్ మాంద్యా అనే కళాకారుడు కర్ణాటక చిత్రకళా పరిషత్‌లో శుక్రవారం ‘న్యూడ్ విత్ మంగళసూత్ర’ ప్రారంభం కానున్నట్లు ప్రకటించాడు. దీనిపై హిందూ జన జాగృతి సమితి అభ్యంతరం వ్యక్తం చేసింది. సమితి కన్వీనర్ భవ్య గౌడ స్పందిస్తూ.. ‘‘భావవ్యక్తీకరణ స్వేచ్ఛను దుర్వినియోగంతో స్త్రీత్వాన్ని అవమానపరుస్తున్నారు’’ అని తెలిపారు. ఈ సందర్భంగా బెంగళూరు పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కళాకారుడు, నిర్వాహకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇది మహిళ ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆమె ఆరోపించడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.