యాప్నగరం

కొడుకు చికిత్స డబ్బుతో తండ్రి జల్సాలు.. ప్రాణాలు కోల్పోయిన పసివాడు

పసివాడి చికిత్స కోసం ఖర్చు చేయాల్సిన సొమ్ముతో తండ్రి పార్టీలు చేసుకున్నాడు. ఫలితంగా ఆ బిడ్డకు తగిన సమయంలో చికిత్స అందక కన్నుమూశాడు.

Samayam Telugu 24 Oct 2019, 6:21 pm
ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొడుకు చికిత్స కోసం సేకరించిన విరాళాలతో తండ్రి జల్సాలు చేశాడు. చివరికి కొడుకు మరణానికి కారణమయ్యాడు. బ్రెజిల్‌కు చెందిన మాటియస్ హెన్రిక్ లెరోయ్ అల్వెస్ (37) రెండేళ్ల కొడుకు జోనో మిగ్యుల్ అల్వెస్ వెన్నెముక కండరాల క్షీణత(AME)తో బాధపడుతున్నాడు.
Samayam Telugu Image Credit: facebook
Image Credit: Facebook


Also Read: ప్రియురాలికి కోర్టు షాక్.. ప్రియుడి భార్యకు రూ.70 లక్షలు చెల్లించాలని ఆదేశం

ఆర్థిక ఇబ్బందుల వల్ల జోనోకు చికిత్స అందించడం కష్టమైంది. దీంతో ఆన్‌లైన్‌లో విరాళాల కోసం అభ్యర్థించాడు. ఈ సందర్భంగా సుమారు రూ.కోటి వరకు విరాళాలు అందాయి. మాటియస్ ఆ డబ్బును జోనో చికిత్స గురించి కాకుండా.. జల్సాలకు ఉపయోగించాడు. భార్య, కొడుకును వదిలిపెట్టి రెండు నెలలుగా లగ్జరీ హోటల్‌లో ఉంటున్నాడు. మొత్తం సొమ్మును పార్టీలు, డ్రగ్స్, వేశ్యలు, కొత్త దుస్తులు, వాచ్‌లు కొనుగోలు చేయడానికి ఖర్చు పెట్టాడు. అయితే, అతడి భార్య కెరీనాకు ఈ విషయం తెలియదు.

Also Read: రైతు ఇంట్లో రెండు తలల పాము, అబ్బురపరిచే వీడియో

జోనో చికిత్స కోసం ఉపయోగించే ఔషదం డోసు ధర రూ.6,421,246 ఉంది. ఇటీవల అత్యవసర పరిస్థితిలో జోనోకు చికిత్స అవసరమైంది. దీంతో కెరీనా మందులు కొనుగోలు చేసేందుకు అకౌంట్‌‌ను చెక్ చేసింది. భారీ మొత్తంలో డబ్బు విత్‌డ్రా అయినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయింది. తగిన సమయంలో చికిత్స అందక జోనో చనిపోయాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు మాటియస్‌ను అరెస్టు చేశారు. అతడికి కఠిన శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.