యాప్నగరం

మండే ఎండల్లో మానవ సేవ.. ప్రజల దాహార్తి తీరుస్తున్న సర్దార్!

ఢిల్లీలో ఎండలకు భయపడి జనాలు బయటకు రావడానికే బయడపడుతుంటే.. ఓ సిక్కు వ్యక్తి మాత్రం ఎండను లెక్క చేయకుండా ప్రజల దాహార్తి తీరుస్తున్నారు.

Samayam Telugu 7 Jun 2019, 4:39 pm
ర్దార్‌పై జోకులు కడుపుబ్బా నవ్విస్తాయి. అయితే, వారు పాటించే మానవీయ విలువలు గురించి తెలిస్తే.. తప్పకుండా వారిపై గౌరవం ఏర్పడుతుంది. ఇందుకు ఈ ఘటనే నిదర్శనం. ఎండలు మండిపోతున్న ఈ రోజుల్లో జనాలు బయటకు రావడానికే భయపడుతుంటే.. ఓ సిక్కు వ్యక్తి మాత్రం తన యాక్టివా ముందు నీటి క్యాన్ పట్టుకుని ఢిల్లీ రోడ్లపై తిరుగుతున్నారు.
Samayam Telugu 1559891757-Screenshot_747


ఎండలో దప్పికతో అల్లాడుతున్నవారికి దాహార్తి తీర్చుతూ మానవత్వం చాటుతున్నారు. @ZeHarpreet అనే వ్యక్తి ట్వీట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రోడ్డు పక్కన స్కూటీపై నీటి క్యాన్లు, మూడు గ్లాసులతో నిలుచుని ఉన్న సర్దార్.. అటుగా వచ్చిపోయే వాహనదారులకు, ఆగివున్న బస్సులో ప్రయాణికుల నీటి బాటిళ్లు నింపి ఇవ్వడం కనిపించింది. ఆయన సేవకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆయన్ని ప్రశంసలతో ముంచెత్తుతూ వీడియోను షేర్ చేసుకుంటున్నారు. అంత వేడిలో తన గురించి ఆలోచించకుండా ఇతరుల దాహార్తి తీర్చుతున్న సర్దార్‌జీ హ్యాట్సాప్ చెప్పకుండా ఉండగలమా! ఇప్పటికైనా నమ్ముతారా.. మానవత్వం ఇంకా బతికి ఉందని!!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.