యాప్నగరం

ప్రయాణికుడి జోక్.. 16 గంటలు ఆలస్యంగా బయల్దేరిన విమానం!

విమాన సిబ్బందిని సరదాగా యెటకారం ఆడదామనుకున్నాడు.. ఫలితంగా అతడు ప్రయాణించాల్సిన విమానం 16 గంటలు ఆలస్యమైంది.

Samayam Telugu 24 Apr 2019, 1:15 pm
ప్రయాణికుడు వేసిన జోక్ వల్ల విమానం 16 గంటలు ఆలస్యంగా బయల్దేరింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది సోమవారం అర్ధరాత్రి తర్వాత 1.20 గంటలకు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు బయల్దేరాల్సిన విమానం మంగళవారం సాయంత్రం 5.23 గంటలకు బయల్దేరింది.
Samayam Telugu 1556085555-Sing2


సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ విమానంలో కూర్చున్న ప్రయాణికుడు అతనితో తెచ్చుకున్న క్యాబిన్ బ్యాగ్‌లో గన్ ఉందంటూ విమాన సిబ్బందితో ఎటకారం ఆడాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది భద్రతా సిబ్బంది సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కొన్ని గంటలపాటు అతడిని ప్రశ్నించారు.

అతడి బ్యాగ్‌లో ఉన్నది గన్ కాదని, గిటార్ అని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్ ఈ ఘటనను నిర్ధారించింది. స్కూట్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ TR574 (BLR-SIN)లో ఓ వ్యక్తి క్యాబిన్ బ్యాగేజీలో గన్ ఉందని చెప్పగానే ప్రయాణికులందరినీ విమానం నుంచి కిందికి దించివేసి సోదాలు జరిపామని పేర్కొంది. విమానంలో ఉన్న అందరినీ లగేజ్‌ను బయటకు రీస్కాన్ చేశామని తెలిపింది. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మరొక విమానాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.